Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబును 16 ఏళ్ళు జైల్లో పెడతాం...

చంద్రబాబును 16 ఏళ్లు జైల్లో పెడతామని, గతంలో ఆయన చేసిన అవినీతిని వెలికితీస్తున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 

chandrababu Naidu will have to spend 16 years behind the bars
Author
Tirupati, First Published Nov 10, 2019, 5:39 PM IST

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఫైర్ అయ్యారు. తమ నాయకుడు జగన్మోహన్‌రెడ్డిని 16 నెలలు జైలులో పెడితే, చంద్రబాబును 16 ఏళ్లు జైల్లో పెడతామని, గతంలో ఆయన చేసిన అవినీతిని వెలికితీస్తున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 

శనివారం తిరుపతిలోని ఆయన స్వగృహంలో మీడియాతో ముచ్చటించారు. అవినీతిని, రౌడీయిజాన్ని, కప్పిపుచ్చుకునేందుకు ఎదుటివాళ్లపై నిందలు వేయడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. 

జనసేన నాయకుడు పవన్‌కల్యాణ్‌ కూడా ఆ బట్ట తానులో ముక్కేనని పెద్దిరెడ్డి ఎద్దేవా చేసారు. చంద్రబాబు తానా అంటే పవన్‌ తందానా అంటారని సెటైర్లు వేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన మూడు దఫాలు కూడా వర్షాలు లేక ప్రజలు కరువు వల్ల ఇబ్బందులను ఎదుర్కొన్నారన్నారు. 

తాము అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే విస్తారంగా వర్షాలు పడ్డాయన్నారు. వర్షాలకు తోడు వరదలు కూడా ఉధృతంగా ఉండడం వల్లనే తాత్కాలిక ఇసుక కొరత ఏర్పడిందని అన్నారు. 

అయితే ప్రతిపక్షాలు పనిగట్టుకుని మరీ, నానా యాగీ చేస్తున్నంత స్థాయిలో మాత్రం ఇసుక కొరత లేదన్నారు. ఇసుక సమస్యతో అనేక మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని చంద్రబాబు పదేపదే చెబుతున్నారని, ఎక్కడ ఎవరు చనిపోయినా ఇసుక సమస్యతోనే చనిపోయారని టీడీపీ వాళ్లు కట్టుకథలు అల్లుతున్నారని టీడీపీ పై మండిపడ్డారు. 

అయినా అలా మరణించిన వారికి కూడా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. తనను అణగదొక్కడానికి చంద్రబాబు ఆది నుండీ కంకణం కట్టుకుని కూర్చున్నారని, అయితే అది ఆయనవల్ల కావడం లేదన్నారు.  

ఇదిలా ఉండగా, చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఒక్కొక్కరికీ ప్రభుత్వం తరఫున 5లక్షలు రూపాయల నష్టపరిహారాన్ని  అందజేస్తామని పెద్దిరెడ్డి ప్రకటించారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఆరేళ్ల బాలికను హత్యచేసిన నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు.

ఇక గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పీడిస్తున్న ఇసుక సమస్య పరిష్కారం పై జగన్ సర్కార్ నడుం బిగించింది. వరదల కారణంగా ఇంతకాలం ఇసుక తవ్వకాలు నిలిచిపోగా  ప్రస్తుతం భారీ ఎత్తును ఇసుక తవ్వకాలను చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో గతంతో పోలీస్తే ఇసుక సమస్య చాలావరకు తగ్గినట్లు ప్రభుత్వం వెల్లడించారు. 

రాష్ట్రంలోని అన్ని నదుల్లో  వరదనీటి ఉదృతి తగ్గుముకం పట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గణనీయంగా ఇసుక సరఫరా పెరిగినట్లు ప్రభుత్వ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఈ ఇసుక సరఫరా వారం రోజుల వ్యవధిలోనే దాదాపు మూడు రెట్లు పెరిగినట్లు అధికారులు తెలిపారు. 

ఇసుక సరఫరా  నవంబరు 1 న 31,576 టన్నుల సరఫరా వుండగా నవంబరు 7 నాటికి 86,482 టన్నులకు పెరింగింది. ఇక ఇవాళ అంటే నవంబరు 8నాటికి  అది 96 వేల టన్నులకు చేరుకుంది. మరో రెండు రోజుల వ్యవధిలోని ఈ సరఫరా లక్ష టన్నులను చేరుకోనుందని అధికారులు తెలిపారు. 

నదుల నుండి మొదటి ఆర్డ్‌ర్, రెండో ఆర్డర్, మూడో ఆర్డర్‌ కింద ఇసుక తవ్వకాలు చేపడుతున్నట్లు తెలిపారు. వరుస స్ట్రీమ్స్‌లో 300 పైగా రీచ్‌లు గుర్తించినట్లు...నదుల్లో నీటిమట్టం తగ్గుముఖం పడుతున్న కొద్ది మరిన్ని ఎక్కువ రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు. 

read more  ఇసుక ధరను నిర్ణయించే అధికారం వారికే... హద్దుదాటితే జైలే...: జగన్

ఇటీవలే ఇసుక మాఫియాపై కఠిన చర్యలు  తీసుకోవాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఈ అంశం రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న నేపథ్యంలో సీఎం కేవలం దీనిపై చర్చించేందుకే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీచేశారు.

ముఖ్యంగా ఇసుక ధరలకు కళ్లెం వేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ ను కూడా సిద్ధంచేయాలంటూ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.

జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఇసుక ధరను నిర్ణయించాలని కలెక్టర్లను ఆదేశించాలని గనులశాఖ అధికారులకు సూచించారు. ఎక్కువ ధరకు అమ్మితే జైలుకు పంపేలా చట్టం తీసుకురావాలన్నారు. ఏ జిల్లా, ఏ నియోజకవర్గాల్లో ఎంత రేటు పెట్టాలో కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయించాలని అధికారులను  ఆదేశించారు. 

రేటు నిర్ణయించాక ధరలను ప్రకటించాలని... నిర్ణయించిన ధరలు ప్రజలకు అర్థమయ్యేలా కలెక్టర్లు ప్రచారం చేయాలన్నారు. నిర్ణయించిన రేటుకే ఇసుకను అమ్మాలని... ఈలోగా ఇసుక సరఫరాను బాగా పెంచాలని సూచించారు. ఇందుకోసం ఒక టోల్‌ ఫ్రీ నంబర్‌ను కూడా పెట్టాలని సూచించారు.

ఇసుకను అధిక రేటుకు అమ్ముతున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుని జైలుకు పంపాలన్నారు. ఒక్క రవ్వకూడా అవినీతికి తావులేకుండా చేస్తున్నామని... అయినా సరే మనం విమర్శలకు గురవుతున్నామని సీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతికి దూరంగా ఉన్నారని...అయినా సరే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు.

read more చంద్రబాబు ఇసుక దీక్ష... ఇందిరాగాంధీ స్టేడియంలో కాకుంటే అక్కడే...: టిడిపి ఎమ్మెల్సీ

వచ్చే వారం స్పందన నాటికి ఈ రేట్లు, టోల్‌ ఫ్రీ నంబర్‌ ప్రకటించాలని ఆదేశించారు. వచ్చేవారం స్పందన కేవలం ఇసుక సమస్యపైనే నిర్వహిస్తామన్నారు. స్పందనలో ఇసుక వారోత్సవం తేదీల ప్రకటిస్తామని  తెలిపారు.

రాష్ట్ర సరిహద్దుల్లో నిఘాను పెంచాలని అధికారులకు సీఎం సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్మగ్లింగ్‌ చేయకూడదరని... టెక్నాలజీని వాడుకోని దీన్ని నివారించాలన్నారు.   స్మగ్లింగ్‌ జరిగితే చెడ్డపేరు వస్తుందన్నారు. చెక్‌పోస్టుల్లో టీంలు, మొబైల్‌ టీంలను పెంచుతామని అధికారులు సీఎం తెలిపారు. ప్రత్యేక టీంలను కూడా పెంచుతామన్న అధికారులు  తెలిపారు.

 చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది ఉండేందుకు వీలుగా కనీస సదుపాయాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రైడ్స్‌ చేయాలి... కేసులు పెట్టాలి... తప్పు చేసిన వారిని విడిచిపెట్టకుండా జైలుకు పంపాలన్నారు. ఇది జరిగితే ఖచ్చితంగా పరిస్థితి అదుపులోకి వస్తుందన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios