తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును (Ashok Babu) ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu క్ష్aidu) పరామర్శించారు. ఈ సందర్భంగా సీఐడీ అరెస్ట్ తదనంతర పరిణామాలపై చంద్రబాబు.. అశోక్‌బాబును అడిగి వివరాలు తెలుసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును (Ashok Babu) ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu క్ష్aidu) పరామర్శించారు. చంద్రబాబు శనివారం మధ్యాహ్నం విజయవాడ పడమటలోని జాస్తివారి వీధిలోని అశోక్‌బాబు నివాసానికి వెళ్లారు. అశోక్‌బాబును పరామర్శించి.. ఆయతో మాట్లాడారు. సీఐడీ అరెస్ట్ తదనంతర పరిణామాలపై చంద్రబాబు.. అశోక్‌బాబును అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు ప్రశ్నించిన తీరును కూడా ఆరా తీశారు. పోలీసులు కేసు విషయం కంటే ఉద్యోగుల సమ్మె అంశాలపైనే ఎక్కువగా ప్రశ్నించారని అశోక్‌బాబు.. చంద్రబాబుకు తెలిపారు.
గురువారం రాత్రి ప్రభుత్వ సర్వీసు రికార్డులో విద్యార్హతను ట్యాంపర్ చేశారనే ఆరోపణలతో అశోక్‌బాబును పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆయను శుక్రవారం రాత్రి బెయిల్ రావడంతో తన నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు టీడీపీ నాయకులు అశోక్‌బాబును పరామర్శించారు. అశోక్ బాబు నివాసానికి వెళ్లి పరామర్శించిన వారిలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర.. తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా కేశినేని నాని మీడియాతో మాట్లాడారు. ‘అశోక్ బాబుపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపాలని చూశారు. తప్పుడు కేసులకు TDP నేతలు భయపడే పరిస్థితి లేదు. ఎంత బెదిరించినా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తాం. ప్రజా సమస్యలపై పోరాటం కోసం పని చేస్తున్నాం. సంక్షేమ పథకాలకు మేము వ్యతిరేకం కాదు. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందాలి’ అని కేశినేని నాని అన్నారు
ప్రభుత్వ సర్వీసు రికార్డులో విద్యార్హతను ట్యాంపర్ చేశారనే ఆరోపణలతో అశోక్‌బాబును గురువారం రాత్రి ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తర్వాత ఆయనను గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. అక్కడే చాలా గంటలపాటు అశోక్‌బాబును ప్రశ్నించారు. అయితే అశోక్‌బాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది ఏపీ హైకోర్టులో శుక్రవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని కూడా సీఐడీని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు లోకాయుక్తను కూడా ఈ కేసులో పార్టీగా చేర్చాలని కూడా హైకోర్టు కోరింది.
ఇదిలా ఉంటే.. అశోక్‌బాబును శుక్రవారం రాత్రి విజయవాడ న్యాయస్థానంలో హాజరుపరిచారు. టీడీపీ శ్రేణుల ఆందోళన నేపథ్యంలో న్యాయమూర్తి నివాసం వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అశోక్‌బాబుపై నమోదు చేసిన కేసులో పేర్కొన్న సెక్షనన్నీ బెయిల్‌కు అర్హమైనవేనని ఆయన తరపున న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.. బెయిల్ మంజూరు చేయకుండా రిమాండ్ విధించాలని సీఐడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చైతన్య కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. అశోక్‌బాబుకు బెయిల్ మంజూర్ చేశారు.
