ఏకకాలంలో బీజేపీ, కాంగ్రెస్‌తో పొత్తుల కోసం చంద్రబాబు ప్రయత్నం: సజ్జల
చంద్రబాబు నాయుడు ఏకకాలంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సజ్జల తీవ్ర విమర్శలు చేశారు. పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని పేర్కొన్నారు.
బీజేపీతో పొత్తు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. పొత్తుల కోసం ఆయన వెంపర్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇందులో ఒక ప్రత్యేక ఏమిటంటే.. ఆయన ఏకకాలంలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
పొత్తుల కోసం చంద్రబాబు పడుతున్న పాట్లు చూస్తుంటే ఆ పార్టీ ఎంత బలహీనంగా ఉన్నదో.. వైసీపీ బలం ఎంతటిదో కూడా అర్థం అవుతున్నదని సజ్జల అన్నారు. ఆయన పొత్తు ప్రయత్నాలు చూస్తుంటే కేవలం బలహీనత కాదు.. ఒక నిరాశ, నిస్పృహ, అంతా అయిపోయిందని.. చివరి ప్రయత్నంగా పొత్తే శరణ్యం అన్నట్టుగా ఆయన వ్యవహారం ఉన్నదని సజ్జల ఆరోపణలు చేశారు.
Also Read: మాధవీలతకు బీజేపీ టికెట్ ఇవ్వడంపై కరాటే కళ్యాణీ రియాక్షన్ ఇదే
ఒక వైపు బీజేపీతో ప్రయత్నాలు చేసుకుంటూనే మరో వైపు కాంగ్రెస్‌ను లైన్‌లో పెట్టుకున్నారని సజ్జల ఆరోపణలు చేశారు. వైఎస్ షర్మిల చంద్రబాబు మాటలనే మాట్లాడుతున్నదని అన్నారు. బీజేపీతో పొత్తు కుదరకపోతే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నాలు ఉన్నాయని ఆరోపించారు.