Chandrababu: రేపు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు.. పొత్తులపై క్లారిటీ కోసం అమిత్ షాతో భేటీ!

రేపు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లుతున్నారు. ఎల్లుండి బీజేపీ నాయకులతో భేటీ కాబోతున్నారు. అమిత్ షాతో ఆయన సమావేశం అవుతారని తెలుస్తున్నది. ఏపీలో పొత్తుల వ్యవహారంపై బీజేపీ నుంచి ఆయన క్లారిటీ తీసుకోనున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
 

chandrababu naidu to meet bjp leaders day after tomorrow, he is to flown delhi tomorrow kms

Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పొత్తులపై విపక్ష శిబిరం తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. టీడీపీ, జనసేన పార్టీలు పొత్తులపై అవగాహనకు వచ్చాయి. సీట్ల సర్దుబాటుపైనా పలు దఫాలుగా చర్చలు జరిపాయి. అయితే, వీటితోపాటు బీజేపీ కూడా కలుస్తుందని ఉభయ పార్టీల నేతలు భావించారు. కానీ, బీజేపీ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేవు. దీంతో ఇప్పుడు స్వయంగా చంద్రబాబు హస్తినకు బయల్దేరారు. బీజేపీ నాయకత్వంతో చంద్రబాబు భేటీ తర్వాత ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై క్లారిటీ రానుంది.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి వెళ్లుతున్నారు. ఎల్లుండి బీజేపీ నాయకులతో ఆయన సమావేశం కానున్నారు. అమిత్ షాతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉన్నది. ఏపీలో పొత్తులపై ఈ భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత బీజేపీ నాయకులతో పవన్ కూడా భేటీ అయ్యే చాన్స్ ఉన్నది. అనంతరం, ఏపీలో పొత్తులపై స్పష్టత రానుంది.

Also Read: GruhaJyothi: రెంట్‌కు ఉండే వారికి కూడా కరెంట్ ఫ్రీ

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేనల మధ్య అవగాహన కుదిరింది. ప్రచారంపైనా ఓ అవగాహన ఉన్నది. కానీ, బీజేపీ నుంచే ఎలాంటి సంకేతాలు రాలేవు. సరికదా.. ఏపీలో బీజేపీ ఒంటరిగానే దూకుడు పెంచింది. దీంతో ఈ రెండు పార్టీలకు బీజేపీ డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తుందా? అనే అనుమానాలు వచ్చాయి. కానీ, ఇటీవలే బీజేపీ అధిష్టానంలో ఏపీ రాజకీయాల అవగాహనలో మార్పులు వస్తున్నట్టు తెలిసింది. ఇలాంటి తరుణంలోనే చంద్రబాబుకు బీజేపీ నాయకుల అపాయింట్‌మెంట్ లభించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios