Asianet News TeluguAsianet News Telugu

45 ఏళ్లలో ఏ తప్పు చేయలేదు, చేయబోను: రాజమండ్రి జైలు నుంచి బయటకి వచ్చాక బాబు

రాజమండ్రి జైలు నుండి విడుదలైన తర్వాత చంద్రబాబు నాయుడు ఇవాళ మాట్లాడారు. తాను ఏనాడూ తప్పు చేయలేదని చెప్పారు.
 

 Chandrababu Naidu thanks to everyone who supported him lns
Author
First Published Oct 31, 2023, 4:51 PM IST

 రాజమండ్రి: తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ తప్పు చేయలేదని టీడీపీ చీఫ్ తేల్చి చెప్పారు. జైలు నుండి విడుదలైన తర్వాత టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు.  తాను కష్టకాలంలో ఉన్న సమయంలో తనకు  మీరందరూ మద్దతు తెలిపారన్నారు. తనకు మద్దతుగా  రోడ్డుపైకి వచ్చి సంఘీభావం తెలిపారన్నారు. అంతేకాదు తాను జైలు నుండి విడుదల కావడం కోసం ప్రత్యేక పూజలు చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.తనపై ప్రజలు చూపిన అభిమానాన్ని తాను  ఏనాడూ మర్చిపోలేనని చంద్రబాబు చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ, విదేశాల్లో కూడ తనకు సంఘీభావం తెలిపారన్నారు. తాను చేపట్టిన విధానాల వల్ల లబ్దిపొందినవారంతా మద్దతిచ్చారన్నారు. 

తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ తప్పు చేయలేదని  చంద్రబాబు స్పష్టం చేశారు. తప్పు చేయడాన్ని తాను ఏనాడూ కూడ సమర్ధించబోనని  చంద్రబాబు వివరించారు. తాను ఏనాడూ తప్పు చేయలేదు, చేయను, చేయబోనని చంద్రబాబు తేల్చి చెప్పారు.హైద్రాబాద్ లో ఐటీ ఉద్యోగులు  సంఘీభావ ర్యాలీల గురించి చంద్రబాబు  ప్రస్తావించారు.తనకు సంఘీభావం ప్రకటించిన అన్ని పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తాను జైలులో ఉన్న  సమయంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తనకు  బహిరంగంగా మద్దతు ప్రకటించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

also read:రాజమండ్రి జైలు నుండి బాబు విడుదల:53 రోజుల తర్వాత జైలు నుండి బయటకు

బీజేపీ, సీపీఐ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లోని కొందరు నేతలకు  తనకు సంఘీభావం తెలిపారన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు  తన కోసం ఆందోళనలు నిర్వహించారన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి సైకిల్ యాత్రలు, పాదయాత్రలు నిర్వహించిన విషయాన్ని  చంద్రబాబు వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios