Asianet News TeluguAsianet News Telugu

రాజమండ్రి జైలు నుండి బాబు విడుదల:53 రోజుల తర్వాత జైలు నుండి బయటకు

రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం విడుదలయ్యారు.
 

Chandrababu naidu Releases  From Rajahmundry Central jail lns
Author
First Published Oct 31, 2023, 4:23 PM IST

రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం విడుదలయ్యారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  చంద్రబాబుకు  ఏపీ హైకోర్టు ఇవాళ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఏపీ హైకోర్టు తీర్పు కాపీని చంద్రబాబు తరపు న్యాయవాదులు  రాజమండ్రి జైలు అధికారులకు  ఇవాళ మధ్యాహ్నం సమర్పించారు.

దీంతో చంద్రబాబును  జైలు నుండి విడుదల చేసే ప్రక్రియను  పూర్తి చేశారు. బాలకృష్ణ, లోకేష్, బ్రహ్మణి సహ కుటుంబ సభ్యులు  రాజమండ్రి జైలు వద్దకు వచ్చారు. వీరితో పాటు  టీడీపీ ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా పలువురు కీలక నేతలు  రాజమండ్రి జైలు వద్దకు చేరుకున్నారు. జైలు నుండి  చంద్రబాబు నాయుడు  అభివాదం చేస్తూ  బయటకు వచ్చాడు.

జైలు నుండి  బయటకు వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు భుజంపై చేయి వేసి ఆప్యాయంగా పలకరించారు చంద్రబాబు.చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో ఎన్‌ఎస్‌జీ టీమ్, బాబు  కాన్వాయ్  ఇవాళ మధ్యాహ్నం  రాజమండ్రి జైలు వద్దకు చేరుకుంది.  రాజమండ్రి సెంట్రల్ జైలుకు మూడు కిలోమీటర్ల దూరంలో  బారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ బారికేడ్లను తోసుకొని టీడీపీ శ్రేణులు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు  వచ్చారు. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రావడంతో  పోలీసులు కూడ చేతులెత్తేశారు. 

రాజమండ్రి సెంట్రల్ జైలు  ఆవరణలోని టీడీపీ శ్రేణులను  పంపించిన తర్వాత  చంద్రబాబు కాన్వాయ్ ను పంపేందుకు  పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా టీడీపీ శ్రేణులు రావడంతో  బాబు కాన్వాయ్ అక్కడి నుండి  బయటకు వెళ్లడం ఇబ్బందిగా మారింది.

also read:యుద్ధం మొదలైంది: బాబుకు మధ్యంతర బెయిల్ పై లోకేష్

  రైలు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు నారా భువనేశ్వరి విజయనగరానికి వెళ్లారు. దీంతో చంద్రబాబు నాయుడు  జైలు నుండి విడుదలయ్యే సమయానికి  భువనేశ్వరి  రాజమండ్రి జైలు వద్దకు రాలేదు.  విజయనగరం ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన తర్వాత  భువనేశ్వరి రాజమండ్రికి బయలుదేరారు. రేపు చంద్రబాబు తిరుమలకు వెళ్లనున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత హైద్రాబాద్ లో ఆసుపత్రిలో  చికిత్స తీసుకుంటారు.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఈ ఏడాది సెప్టెంబర్ 9న చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.  అప్పటి నుండి ఆయన జ్యడీషీయల్ రిమాండ్ లో ఉన్నారు.  చంద్రబాబు జైల్లో  52 రోజులు ఉన్నారు. 53వ రోజున చంద్రబాబు  జైలు నుండి విడుదలయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios