అమరావతి: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీజీ వెంకటేష్ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యకుండా ఉండాల్సిందంటూ మండిపడ్డారు.

 పార్టీ విధాన పరమైన నిర్ణయాలను వ్యక్తిగత నిర్ణయాలుగా ప్రకటించొద్దంటూ హెచ్చరించారు. టీజీ వెంకటేష్ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం వల్ల ప్రజలు గందరగోళానికి గురవుతారని చంద్రబాబు వాపోయారు. గత కొంతకాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాస్త స్తబ్ధుగా ఉన్నారు. 

తెలుగుదేశం పార్టీపై విమర్శల దాడిని కాస్త తగ్గించారు. ఈ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్ లో పవన్ ను కలిసిరావాలంటూ అడిగే అవకాశాలుంటున్న నేపథ్యంలో ముందుగానే టీజీ వెంకటేష్ ఇలా వ్యాఖ్యానించడం సరికాదని చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది.  
 

ఈ వార్తలు కూడా చదవండి

అదుపుతప్పి మాట్లాడితే నేను వేరే వ్యక్తిని జాగ్రత్త : టీజీ వెంకటేష్ కు పవన్ వార్నింగ్

గుట్టు విప్పిన టీజీ వెంకటేష్: జనసేనతో టీడీపి పొత్తు