అబ్దుల్ కలాం పేరు తీసేసి వైఎస్సార్ వ్యూ పాయింట్ అని పేరు పెట్టడం బాధకరం: జగన్‌పై చంద్రబాబు ఫైర్..

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన సర్కార్‌పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. వైజాగ్‌లోని కలాం వ్యూపాయింట్ పేరును  వైఎస్సార్ వ్యూపాయింట్‌గా మార్చాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చంద్రబాబు నాయుడు విమర్శించారు.

Chandrababu Naidu says Saddened to see Abdul Kalam View Point in Vizag being renamed as YSR View Point ksm

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన సర్కార్‌పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. వైజాగ్‌లోని కలాం వ్యూపాయింట్ పేరును  వైఎస్సార్ వ్యూపాయింట్‌గా మార్చాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో చంద్రబాబు ఓ పోస్టు చేశారు. ‘‘వైజాగ్‌లోని అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌ని వైఎస్సార్ వ్యూ పాయింట్‌గా మార్చడం బాధాకరం. పేర్లు మార్చే ఈ సైకోపతిక్ శాడిజం ఏమిటి?. ఇది నిజాయితీ, క్రమశిక్షణ, పట్టుదలకు ప్రతీకగా నిలిచిన అత్యంత ప్రియమైన ప్రజల రాష్ట్రపతిని అగౌరవపరచడం తప్ప మరొకటి కాదు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. 

 


అయితే చంద్రబాబు చెబుతున్న వ్యూ పాయింట్ సీతకొండ ప్రాంతంలో ఉంది. అయితే ఈ ప్రాంతం ఒకప్పుడు చెత్తతో నిండిపోయి ఉండేదని వైజాగ్ వాలంటీర్స్ అస్సోసియేషన్ చెబుతుంది. తాము ఈ ప్రాంతాన్ని క్లీన్ చేశామని.. ఎంతో మంది వాలంటీర్స్ ఇందుకోసం కృషి చేశారని చెప్పింది. ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం ఎంతో ఖర్చుపెట్టి అభివృద్ది చేస్తుందని.. దానిని ప్రభుత్వానికి థాంక్స్ అని తెలిపింది. అయితే  తాము ఈ ప్రాంతానికి కలాం వ్యూ పాయింట్‌ అని పేరు పెట్టుకున్నామని.. అది ఎంతో మందిలో స్ఫూర్తి నింపిందని అందుకే స్వచ్ఛందంగా వచ్చి క్లీనప్‌‌లు చేపట్టారని పేర్కొంది. అయితే  చట్టప్రకారం శాశ్వతంగా కలాం వ్యూ పాయింట్‌గా పేరు పెట్టాలని కొద్ది రోజుల క్రితం డిమాండ్ చేసింది. 

అయితే తాజాగా సీతకొండ  ప్రాంతంలో వైఎస్సార్ వ్యూ పాయింట్‌ అని బోర్డు ఉన్న వీడియోను చంద్రబాబు నాయుడు షేర్ చేశారు. కలాం వ్యూ పాయింట్‌ను వైఎస్సార్ వ్యూ పాయింట్‌గా మార్చారంటూ విమర్శలు చేశారు. మరి చంద్రబాబు విమర్శలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios