కాకినాడ:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అంటూ ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు నాయుడు అధికారమే పరమావధిగా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 

అంతేకాదు చంద్రబాబు బాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి అధికారంలోకి వచ్చినంత వరకు అంటే 2009 నుంచి 2014 వరకు యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీలపై చంద్రబాబు వ్యాఖ్యలను ట్విట్టర్ లో పొందుపరిచారు. 

గమ్మత్తు ఏంటంటే ఆ ట్వీట్ లో డేట్ తో సహా ఏమని తిట్టారో కూడా పొందుపరచడం. కాంగ్రెస్ పార్టీ, సోనియా మరియు రాహుల్ గాంధీలపై చంద్రబాబు విమర్శలు అనే టైటిల్ కూడా పెట్టారు. అంతేకాదు ఆనాడు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ ను సైతం పొందుపరిచారు. 

 

ట్విట్టర్ వేదికగానే కాదు ప్రజాపోరాట యాత్రలో భాగంగా శుక్రవారం పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి తుని వరకు జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో రైలు యాత్ర చేశారు. అనంతరం తునిలో బహిరంగ సభలో ప్రసంగించారు. ఆ ప్రసంగంలోనూ చంద్రబాబుపై పవన్ నిప్పులు చెరిగారు. 

చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి ఎలా వచ్చారో తనకు తెలుసన్నారు. సొంత మామకు దెబ్బకొట్టి రాజకీయాల్లోకి వచ్చారని అన్నీ తెలిసి మద్దతు ఇచ్చానని కానీ ఆయన్ను ఎప్పుడూ సంపూర్ణంగా నమ్మలేదన్నారు. నిన్న బీజేపీతో పొత్తు నేడు కాంగ్రెస్ తో పొత్తు రేపోమాపో జగన్ తో కూడా పొత్తుపెట్టుకున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు. 

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే అదేపార్టీని నడిపిస్తున్న చంద్రబాబు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టుపెట్టారంటూ నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఖబర్దార్ అంటూ వార్నింగ్ సైతం ఇచ్చారు. 

2014లో చంద్రబాబు నాయుడుకు మద్దతిచ్చి తప్పుచేశానని కానీ 2019లో అలా చెయ్యబోనన్నారు. బాధ్యత లేని చంద్రబాబుకు రాష్ట్రాన్ని అప్పగించనన్నారు. చంద్రబాబులా తనకు అధికారం కాదు కావాల్సింది రాజకీయాల్లో మార్పు అంటూ పవన్ ఆవేశంగా ప్రసంగించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

సామాన్యుడితో పవన్ రైలు యాత్ర

చంద్రబాబు సినిమా ప్లాప్ అవ్వడం ఖాయం:పవన్ కళ్యాణ్

జగన్ పై దాడి ఘటనలో టీడీపీ వెకిలి వేషాలు:పవన్ కళ్యాణ్

కుత్తికోసుకుంటా కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టను:పవన్ కళ్యాణ్