తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. జూలై 18 నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేశారు. 

జూలై 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (parliament monsoon session 2022) ప్రారంభమవుతున్న నేపథ్యంలో టీడీపీ (tdp) ఎంపీలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) సమావేశమయ్యారు. ఈ మేరకు పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ భేటీకి లోక్‌సభ సభ్యులు గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. 

ఇకపోతే.. రాష్ట్రంలోని వ‌రద‌లు, వర్షాలపై (floods in ap) టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం స్పందించారు. నిన్న మీడియాతో మాట్లాడిన ఆయన.. వరద బాధితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదమరచి నిద్రపోతోందని ధ్వజమెత్తారు. ఇటువంటి విపత్తుల సమయంలో ప్రజలను హెచ్చరించే వ్యవస్థలను.. జ‌గ‌న్ (ys jagan) ప్రభుత్వం నాశనం చేసిందని విమ‌ర్శించారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం అందించే.. చిన్న చిన్న‌ సూచన ప్ర‌జ‌ల‌కు ధైర్యాన్ని ఇస్తాయ‌ని అన్నారు. తగిన సమయంలో అప్రమత్తం చేయడం వల్ల ప్రజల ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించగలమ‌ని తెలిపారు.

ALso Read:TDP Chandrababu Naidu: రాజకీయ విమర్శలు మాని.. బాధితుల‌కు ఆదుకోవాలి.. ప్ర‌భుత్వం చంద్ర‌బాబు ఆగ్ర‌హం

విప‌త్తుల‌ను ముందుగా తెలియజేసే సాంకేతిక వ్యవస్థను గత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకువచ్చిందనీ, వాటి ద్వారా విప‌త్తు ప్ర‌భావిత గ్రామాల ప్రజలకు మొబైల్ ఫోన్ ల‌కు రియల్ టైంలో వరద సమాచారం పంపి...వారిని అప్రమత్తం చేసేలా టెక్నాలజీని తీసుకువ‌చ్చింద‌ని తెలిపారు. ప్రకృతి విపత్తులలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని మోహరింప జేసి ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు తక్షణ సాయం అందించే వాళ్లమ‌ని తెలిపారు. అయితే.. నేడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేద‌నీ, పూర్తిగా భిన్నంగా మారింద‌ని, ఆనాటి వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసారని తెలిపారు. యంత్రాంగాన్ని నడిపించాల్సిన పాలకుల అలసత్వంతో ప్రజలు అల్లాడుతున్నారన అన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు వరద బాధితులకు అండగా నిలిచి సాధ్యమైనంత సాయం చెయ్యాలని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వం కూడా ప్రతిపక్షాల డిమాండ్లపై రాజకీయ విమర్శలతో కాలయాపన చెయ్యకుండా ప్రజలను ఆదుకునే చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందనే నమ్మకాన్ని ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉంద‌ని అన్నారు.