న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, విభజన చట్టంలోని 18 అంశాలను అమలు చేయాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు మంగళవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని బృందం వినతి పత్రం సమర్పించింది.

ఏపీకి ఇచ్చిన  హామీలను అమలు చేయాలని కోరుతూ సోమవారం నాడు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో  చంద్రబాబునాయుడు 12 గంటల పాటు దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు బీజేపీయేతర పార్టీలు మద్దతును ప్రకటించాయి.

ఈ దీక్షకు కొనసాగింపుగానే  ఇవాళ ఏపీ భవన్‌ నుండి చంద్రబాబునాయుడు ర్యాలీగా జంతర్ మంతర్ వద్దకు చేరుకొన్నారు. 11 మంది ప్రతినిధులతో వాహనాల్లో   రాష్ట్రపతి భవన్‌కు చేరుకొన్నారు. రాష్ట్రపతి భవన్‌లో కోవింద్ తో  బాబు బృందం భేటీ అయింది. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను బాబు రాష్ట్రపతి వివరించారు.

సంబంధిత వార్తలు

ఏపీ మొత్తం ఢిల్లీ వీధుల్లో...: పాదయాత్రలో చంద్రబాబు

రాష్ట్రపతి భవన్‌కు పాదయాత్రగా బయలుదేరిన చంద్రబాబు