చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్ పోర్టులో చంద్రబాబునాయుడు నిరసనను విరమించారు. అధికారులు చంద్రబాబుతో చేసిన చర్చలు విజయవంతమయ్యాయి.

రేణిగుంట: చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్ పోర్టులో చంద్రబాబునాయుడు నిరసనను విరమించారు. అధికారులు చంద్రబాబుతో చేసిన చర్చలు విజయవంతమయ్యాయి.

సోమవారం నాడు ఉదయం రేణిగుంట విమానాశ్రయంలోనే చంద్రబాబునాయుడు బైఠాయించి నిరసనకు దిగారు. చిత్తూరుకు వెళ్లకుండా పోలీసులు అడ్డు చెప్పడంతో చంద్రబాబు ఎయిర్ పోర్టు లాంజ్ లో నేలపై కూర్చొని నిరసనకు దిగారు.

also read:ఆరు గంటలుగా రేణిగుంట ఎయిర్‌పోర్టులో బాబు నిరసన

ఆందోళనకు దిగిన చంద్రబాబునాయుడితో జాయింట్ కలెక్టర్, చిత్తూరు ఎస్పీ చర్చించారు. ఈ చర్చలు ఫలవంతం కావడంతో చంద్రబాబునాయుడు రేణిగుంట విమానాశ్రయం నుండి హైద్రాబాద్ కు బయలుదేరాడు.

చిత్తూరు, తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకొన్నాయని చంద్రబాబు అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ విషయమై తాము చర్యలు తీసుకొంటామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ హామీతో చంద్రబాబునాయుడు తన నిరసనకు దిగారు.

రేణిగుంట విమానాశ్రయంలో సుమారు 9 గంటల పాటు చంద్రబాబునాయుడు నేలపైనే కూర్చొని నిరసనకు దిగారు. అధికారుల హామీతో చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయం నుండి హైద్రాబాద్ కు బయలుదేరి వెళ్లారు.