టిక్కెట్ దక్కని నేతలకు బుజ్జగింపులు: అసంతృప్తులకు చంద్రబాబు నుండి పిలుపు
టిక్కెట్లు దక్కని టీడీపీ నేతలకు ఆ పార్టీ నాయకత్వం బుజ్జగించనుంది.ఈ మేరకు టిక్కెట్టు దక్కని నేతలకు చంద్రబాబు నుండి పిలుపునిచ్చింది.
అమరావతి: పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీ.కే. పార్థసారథికి తొలి జాబితాలో టిక్కెట్టు దక్కలేదు. పెనుకొండ అసెంబ్లీ స్థానంలో పార్థసారథి స్థానంలో సవితకు టిక్కెట్టు దక్కింది. సవితకు టిక్కెట్టు కేటాయించడాన్ని బీ.కే. పార్థసారథి వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్థసారథికే టిక్కెట్టు కేటాయించాలని కోరుతున్నారు. తెలుగు దేశం పార్టీ అధినేత బీ.కే. పార్థసారథికి చంద్రబాబు నాయుడు నుండి పిలుపు వచ్చిందని ప్రచారం సాగుతుంది.
also read:సోషల్ మీడియాలో దుష్ప్రచారం: సైబరాబాద్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు
దరిమిలా బీ.కే.పార్థసారథి చంద్రబాబును కలిసే అవకాశం ఉంది. గతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా తెలుగు దేశం పార్టీ తరపున బీ.కే. పార్థసారథి ప్రాతినిథ్యం వహించారు. 2019 ఎన్నికల్లో పెనుకొండ అసెంబ్లీ స్థానం నుండి తెలుగు దేశం పార్టీ అభ్యర్ధిగా బీ.కే. పార్థసారథి పోటీ చేసి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి చేతిలో బీ.కే. పార్థసారథి ఓటమి పాలయ్యారు. అయితే ఈ దఫా పెనుకొండ అసెంబ్లీ స్థానం నుండి సవితకు తెలుగు దేశం పార్టీ టిక్కెట్టు కేటాయించింది. బీ.కే. పార్థసారథిని ఈ దఫా ఎంపీగా బరిలోకి దింపే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.ఈ పరిణామాల నేపథ్యంలో బీ.కే. పార్థసారథికి చంద్రబాబు నుండి పిలుపు వచ్చిందని సమాచారం.
also read:నడిరోడ్డుపై మహిళను వేధించిన వ్యక్తి: బుద్ది చెప్పిన ప్రయాణీకులు, సోషల్ మీడియాలో వైరల్
మరో వైపు ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలోని అనకాపల్లి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించింది తెలుగు దేశం పార్టీ. దీంతో అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ అనుచరులు నిరసనకు దిగారు. అనకాపల్లిలో తెలుగు దేశం పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం పీలా గోవింద్ చంద్రబాబును కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే పొత్తుల్లో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తెనాలి సీటును జనసేనకు కేటాయించారు. దీంతో మాజీ మంత్రి ఆలపాటి రాజాకు అవకాశం దక్కలేదు. దరిమిలా ఆలపాటి రాజా వర్గీయులు నిన్నటి నుండి అసంతృప్తితో ఉన్నారు. ఆదివారం నాడు మాజీ మంత్రి ఆలపాటి రాజాను చంద్రబాబు తన నివాసానికి పిలిపించి మాట్లాడారు. అయితే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నేతలు ఎవరూ కూడ మాట్లాడొద్దని రాజా తన అనుచరులకు చెప్పారు.
also read:బుల్లెట్ కు గుడి కట్టి పూజలు: ఎందుకో తెలుసా?
పొత్తుల నేపథ్యంలో సీట్లను త్యాగం చేయాల్సిన అనివార్య పరిస్థితులున్నాయని చంద్రబాబు పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. నిన్న ప్రకటించిన తొలి జాబితాలో కొందరు సీనియర్లకు చోటు దక్కలేదు. దేవినేని ఉమమహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి నేతలకు చంద్రబాబు నుండి పిలుపు వచ్చిందని టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీట్లు త్యాగం చేసిన వారికి పదవుల పంపకంలో ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.