Asianet News TeluguAsianet News Telugu

అమరవీరుల త్యాగ ఫలాలను ప్రతీ ఒక్కరు స్మరించుకోవాలి ...సీఎం చంద్రబాబు నాయుడు

అమరవీరుల త్యాగ ఫలాలను ప్రతీ ఒక్కరు స్మరించుకోవాల్సిన అవసరం ఉందని  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో స్వాంతత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎన్టీఆర్ గుండె చప్పుడన్నారు. 

CHANDRABABU NAIDU INDEPENDENCE DAY SPEECH
Author
Srikakulam, First Published Aug 15, 2018, 10:55 AM IST

శ్రీకాకుళం జిల్లా:
అమరవీరుల త్యాగ ఫలాలను ప్రతీ ఒక్కరు స్మరించుకోవాల్సిన అవసరం ఉందని  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో స్వాంతత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎన్టీఆర్ గుండె చప్పుడన్నారు. 

టెక్కలి నియోజకవర్గం నుంచి ఎన్టీఆర్ ను ఆదరించిన జిల్లా శ్రీకాకుళం జిల్లా అని తెలిపారు. 194 కిలోమీటర్ల సముద్ర తీరం, ప్రముఖ  పుణ్యక్షేత్రాలకు నెలవు శ్రీకాకుళం జిల్లా అని కొనియాడారు. మహాత్మగాంధీ మెచ్చిన పొందూరు ఖద్దర్ శ్రీకాకుళం జిల్లాకు చెందడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం అగ్రతాంబూలం ఇస్తుందని కొనియాడారు. 

1995-2004 సంవత్సర కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశామన్నారు. మహిళా సాధికారికత కోసం డ్వాక్రా సంఘాలను బలోపేతం చేశామన్నారు. ఆనాడే విజన్ 2020 ప్రణాళికను తయారు చేసి అమలు చేశామని గుర్తు చేశారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios