Asianet News TeluguAsianet News Telugu

తెలుగుజాతి గర్వించేలా సచివాలయ నిర్మాణం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో చారిత్రక నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. తెలుగువారి ఆత్మగౌరవానికి చిహ్నంగా రాజధాని నిర్మాణం జరుగుతుందని, బౌద్దస్తూపం ఆకారంలో ఐకానిక్ భవనం ఉండబోతుందని తెలిపారు. 

chandrababu naidu Inauguration Secretariat workers
Author
Amaravathi, First Published Dec 27, 2018, 9:45 AM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో చారిత్రక నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. తెలుగువారి ఆత్మగౌరవానికి చిహ్నంగా రాజధాని నిర్మాణం జరుగుతుందని, బౌద్దస్తూపం ఆకారంలో ఐకానిక్ భవనం ఉండబోతుందని తెలిపారు. 

అమరావతిలో గురువారం ఉదయం సచివాలయం ఐదు టవర్లకు ర్యాప్ట్‌ ఫౌండేషన్‌ పనులను ప్రారంభించించిన చంద్రబాబు అత్యాధునిక టెక్నాలజీతో సచివాలయం, హెచ్ఓడీ భవనాలను నిర్మించబోతున్నట్లు తెలిపారు. 
 
36 నెలల్లో టవర్ల నిర్మాణం పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 1375 ఎకరాలలో పరిపాలన భవనాలు ఉంటాయని చెప్పారు. ఒకేసారి 10వేల మంది విజిటర్స్‌ వీక్షించేలా నిర్మాణం ఉంటుందని తెలిపారు. సచివాలయ ప్రాంగణంలో 4వేల కార్లు పార్క్‌ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.  

ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఎత్తైన 5టవర్ల సచివాలయానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. అలాగే తొలి డయాగ్రిడ్ భవన నిర్మాణానికి కాంక్రీట్ పునాది  పనులను కూడా సీఎం ప్రారంభించారు. 

ప్రపంచానికే తలమానిఖంగా సచివాలయం నిర్మాణం ఉండబోతుందని తెలిపారు. 250 మీటర్ల ఎత్తులో భవన నిర్మాణం
 ఉంటుందన్న చంద్రబాబు 
40 అంతస్థులతో 4 భవనాలు, 

50 అంతస్థులతో మరో భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. 

56 లక్షల ఎస్ ఎఫ్ టి నిర్మాణం ,

13 లక్షల ఎస్ ఎఫ్ టి ఏరియాలో 4 వేల వాహనాలు పార్కింగ్
 కు వీలుండేలా నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు.
 దేశంలోనే ఇది అత్యంత భారీ ర్యాఫ్ట్ ఫౌండేషన్‌గా అరుదైన ఖ్యాతి అంటూ అభివర్ణించారు. 

12 వేల క్యూ.మీ. మేర 13 అడుగుల లోతులో ర్యాఫ్ట్ ఫౌండేషన్ జరగనుందన్న చంద్రబాబు 

దేశంలో ఈ తరహా భారీ నిర్మాణం ఇదేనేమోనన్నారు. 

రాజధానిలో నూతన సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలను ప్రపంచస్థాయి ప్రమాణాలతో, అత్యంత భారీ భవంతులకు దీటుగా, ఆధునిక హంగులతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. 

ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణశిల్పి నార్మన్‌ ఫోస్టర్‌కి చెందిన ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్‌ సంస్థ సచివాలయం కోసం ఐదు టవర్ల నిర్మాణానికి సంబంధించిన ఆకృతులను, నిర్మాణ ప్రణాళికలను రూపొందించాయన్నారు. ఈ ఐదు టవర్లను ఒకే రాఫ్ట్‌ ఫౌండేషన్‌పై నిర్మిస్తున్నట్లు చెప్పారు. 

నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు వేల సంఖ్యలో కార్మికులను, వందల సంఖ్యలో యంత్రాలను, టన్నుల కొద్ది నిర్మాణ సామగ్రిని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. పోస్టర్ అండ్ పార్టనర్ సంస్థ అద్భుత ప్రణాళిక, సీఆర్‌డీఏ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ఏకధాటిగా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. 

ప్రజా రాజధానిలో 50 వేల మంది అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. 

అమరావతిలో కొండవాగు ముంపు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పోలవరం నిర్మాణం తుదిదశకు చేరుకుందన్నారు. 6 నెలల్లో పోలవరం నుంచి సాగునీరు అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు..  

రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కేంద్రప్రభుత్వం సహకరించలేదని వాపోయారు. రాజధాని నిర్మాణానికి కేవలం రూ.1500కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. అటు ప్రతిపక్ష పార్టీ సైతం రాజధాని నిర్మాణానికి ఏమాత్రం సహకరించలేదని విమర్శించారు. 

రైతులు స్వచ్ఛంధంగా భూములు ఇస్తుంటే ఇవ్వకుండా అడ్డుకున్నారంటూ మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి కృషి చేస్తుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ ఆరోపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అయితే రాష్ట్రరాజధాని నిర్మాణానికి రైతులు ఎంతో సహకరించారని వారి మేలు ఎప్పటికీ మరచిపోనన్నారు. రాజధానికి భూమలు ఇచ్చిన రైతులు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు చంద్రబాబు నాయుడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios