మ్యాన్ అఫ్ ది మ్యాచ్, ఆంధ్రా అసెంబ్లీ బడ్జెట్  సమావేశాల్లో  8 గంటల 19 నిమిషాలు మాట్లాడిన  మహోపన్యాసకుడు ఆయనే...

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి తొలి అసెంబ్లీ సమావేవంలో మహోపన్యాసకుడిగా నిలిచారు.అసెంబ్లీలో మాట్లాడటంలో ఆయనకెవరూ సాటిలేరని రుజువయింది. సభలో ఎవరెవరు ఎంతసేపు మాట్లాడారో లెక్కలు వెలువడ్డాయి. ఈ రోజు విపరీతమయిన గొడవ మధ్య ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది.

ఈ బడ్జెట్ సమావేశాలు 14 రోజులు జరిగాయి. శాసనసభ 57 గంటల 17 నిమిషాలు పనిచేసింది. ఈ సమావేశాల్లో 21 బిల్లులకు ఆమోదం లభించింది. స్టార్‌ ప్రశ్నలు-43, 25 ప్రశ్నలు సభ ముందుకొచ్చాయి.

రూల్‌ 344 కింద 2 అంశాలపై చర్చజరిగింది. మంత్రుల 4 స్టేట్‌మెంట్లు ఇచ్చారు. అలాగే ప్రభుత్వం మూడు తీర్మానాలు ప్రవేశపెట్టింది. సభలో 47 మంది సభ్యులు వివిధ అంశాలపై మాట్లాడారు.

సభ 57.17 గంటలు పనిచేస్తే , అధికార టీడీపీ 42 గంటల 9 నిమిషాలు పాటు ఉపన్యాసాలు వినిపించింది. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు- 8 గంటల 19 నిమిషాలు మాట్లాడి నెంబర్ వన్ గా నిలిచారు.

ప్రతిపక్ష వైసీపీ 12 గంటల సమయం లభిస్తే, జగన్‌ 3 గంటల 46 నిమిషాల మాత్రమే మాట్లాడగలిగారు. ఇక బీజేపీ 3 గంటల 32 నిమిషాల సమయం కేటాయిస్తే, వైజాగ్ శాసన సభ్యడు విష్ణుకుమార్‌రాజొక్కరే 3 గంటల 13 నిమిషాలు మాట్లాడారు.

ఇంత గొడవ జరిగినా, సభలో వృధా అయిన సమయం ఎంతో తెలుసా...కేవలం గంట 53 నిమిషాలు మాత్రమే. ఇందులో వైసీపీ గంట 49 నిమిషాలు, టీడీపీ 4 నిమిషాల సమయాన్ని వృథా చేసిందని అసెంబ్లీ లెక్కలు చెబుతున్నాయి.