రామతీర్థంలో రాములవారి విగ్రహధ్వంసం కేసులో సూరిబాబు మీద కేసు పెట్టడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లతో తన అసహనాన్ని వ్యక్తం చేశారు. 

రామతీర్థం ఘటనలో అసలు దోషులను పట్టుకోడం మానేసి...అమాయకుడైన రామభక్తుడు సూరిబాబును తప్పు ఒప్పుకోవాలంటూ హింసించడం, తెల్లకాగితాలపై సంతకాలు తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని తెలిపారు.

మరో ట్వీట్ లో అధికారులు కోరితే ప్రమాదకరమైన బావిలోకి దిగి సహకరించినందుకు అతనికి, అతని కుటుంబానికి మీరు ద్రోహం చేస్తారా? నేరాన్ని తెలుగుదేశం మీదికి నెట్టాలనుకునే కుట్రలను సహించేది లేదు జాగ్రత్త! వైసీపీ వాహనంపై ఎవరో వాటర్ ప్యాకెట్లు వేస్తే, తెలుగుదేశం కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెట్టడం సిగ్గుమాలిన చర్యఅని దుయ్యబట్టారు.

ఇక మూడో ట్వీట్ లో పోలీసులూ! ప్రభుత్వం చెప్పిన దాన్ని గుడ్డిగా అనుసరిస్తూ, దేవుడి విషయంలో పాపం మూటకట్టుకోవద్దు. అంటూ పోలీసులకు హితబోధ చేశారు.