దీపం పథకం.. తెలుగునాట ఒక సంచలనం.. వంటింట్లో మహిళలు పడుతున్న కష్టాలను చూడలేక నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపం పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు
దీపం పథకం.. తెలుగునాట ఒక సంచలనం.. వంటింట్లో మహిళలు పడుతున్న కష్టాలను చూడలేక నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపం పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ పథకం ద్వారా ధనవంతులకే పరిమితమైన గ్యాస్ స్టవ్ సదుపాయాన్ని పేదల ముంగిటికి తెచ్చారు. ఆ పథకానికి ప్రజలు నీరాజనాలు పట్టారు.. ఆయనకే రెండో సారి అధికారాన్ని అప్పగించారు.
తాజాగా సాధికారమిత్రలతో సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను చిన్నప్పడు వంటింట్లో మహిళలు పడుతున్న కష్టాన్ని చూశానని... దాని ప్రతిఫలమే ‘‘దీపం’’ పథకమని చంద్రబాబు తెలిపారు.. తన చిన్నతనంలో మహిళల పట్ల సమాజంలో వివిక్షను, నిర్లక్ష్యాన్ని చూశానని .. అందుకే మహిళలు అభివృద్ధిలో భాగం కావాలని ఆనాడే అనుకున్నానన్నారు. దీనిలో భాగంగానే పొదుపు సంఘాలను ప్రోత్సహించానని స్పష్టం చేశారు.
కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడానికి మహిళా సంఘాలతోనే ప్రచారం చేయించానని వెల్లడించారు. పదేళ్లకాలంలో నిర్వీర్యమైపోయిన డ్వాక్రా సంఘాలకు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రాణం పోశామని.. ఆర్ధిక అసమానతలను తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.
