అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పడంపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆమంచి కృష్ణమోహన్ కు ఎంతో గౌరవం ఇచ్చానని చెప్పుకొచ్చారు. 

గురువారం ఉదయం పార్టీ నేతలతో చంద్రబాబు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఆమంచి పార్టీ వీడిన అంశం చర్చకు వచ్చింది. ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోలేని వ్యక్తి అని చెప్పుకొచ్చారు. 

ఆమంచి లాంటి వ్యక్తులు పార్టీ వీడినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదన్నారు. తాను రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతున్నా ఆమంచి కోసం గంట సమయం కేటాయించి సముదాయించానని తెలిపారు. చీరాల నియోజకవర్గ అభివృద్ధికి రూ.700 కోట్లు ఇచ్చినట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. 

మరోవైపు బుధవారం ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. మంచి రోజు చూసుకుని పార్టీలో చేరతానంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపైనా, పసుపు-కుంకుమ పథకంపైనా ఆమంచి కృష్ణమోహన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.   

ఈ వార్తలు కూడా చదవండి

 పోతేపోయాడు, పార్టీకొచ్చిన నష్టం ఏమీ లేదు: ఆమంచిపై మంత్రి శిద్ధా రాఘవరావు