Asianet News TeluguAsianet News Telugu

అప్పుడు కోతలు కోసి, ఇప్పుడు మౌనీ బాబా అవతారమా: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైర్లు

ఎన్నికల సమయంలో బీసీలు, కాపులను ఉద్దరిస్తానని కోతలు కోసిన మాజీ సీఎం చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ కేబినెట్‌ కూర్పుపై ప్రశంసించడానికి ఒక్క మాట రావడం లేదన్నారు. సామాజికంగా అణిచివేతకు గురైన వారికి నాలుగు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడంపై ఏ వ్యాఖ్య చేయకుండా చంద్రబాబు నాయుడు ‘మౌనీ బాబా’ అయ్యారంటూ ధ్వజమెత్తారు. 

Chandrababu Mouni Baba incarnation says vijayasaireddy
Author
Amaravathi, First Published Jun 11, 2019, 7:51 AM IST

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి. చంద్రబాబూ.. పాలకుడికి, మ్యానిప్యులేటర్‌కు ఉన్న తేడా ఇదే తెలుసుకో’ అంటూ ట్విట్టర్ వేదిక చురకలంటించారు. 

తమ వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ. 6 వేలకు పెంచాలని ధర్నా చేసిన ‘ఆశా’ అక్కా చెల్లెమ్మలపై మహిళా దినోత్సవం రోజునే పోలీసులను ఉసిగొల్పి అప్పటి సీఎం చంద్రబాబు అరెస్టు చేయించాడని గుర్తు చేశారు. 

అయితే ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రం మందస్తు హామీ ఇవ్వకున్నా వారి వేతనాలను 300 శాతం పెంచుతూ కొత్త ఆశలు నింపారంటూ ట్వీట్ చేశారు. పాలకుడికి మ్యానిప్యులేటర్‌కి తేడా ఇదే బాబూ అంటూ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. 

వైఎస్‌ జగన్‌ తన కేబినెట్లో 60 శాతం మంత్రులు అణగారిన వర్గాలకు చెందిన వారేనని దేశంలో దళితులు, బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. 

ఎన్నికల సమయంలో బీసీలు, కాపులను ఉద్దరిస్తానని కోతలు కోసిన మాజీ సీఎం చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ కేబినెట్‌ కూర్పుపై ప్రశంసించడానికి ఒక్క మాట రావడం లేదన్నారు. సామాజికంగా అణిచివేతకు గురైన వారికి నాలుగు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడంపై ఏ వ్యాఖ్య చేయకుండా చంద్రబాబు నాయుడు ‘మౌనీ బాబా’ అయ్యారంటూ ధ్వజమెత్తారు. 


మరోవైపు భారత ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు విజయసాయిరెడ్డి. రాష్ట్రాభివృద్ధికి తన సహకారం సదా ఉంటుందని హామీ ఇచ్చిన మోదీకి ధన్యవాదాలు అన్నారు. స్పెషల్‌ స్టేటస్‌ తోపాటు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ప్రధాని తోడ్పాటు అందిస్తారని ఏపీ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు. సీఎం వైఎస్‌ జగన్‌ యజ్ఞంలా చేపట్టిన కార్యక్రమాలకు కేంద్రం అండగా నిలవాలని విజయసాయిరెడ్డి ఆకాంక్షించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios