Asianet News TeluguAsianet News Telugu

ఈ పది డిమాండ్ల సాధనకు ప్రభుత్వంతో ఢీ... నిరసనకు పిలుపునిచ్చిన చంద్రబాబు

10 డిమాండ్ల సాధన కోసం ఈ నెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలను చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. 

chandrababu meeting with tdp senior leaders akp
Author
Amaravati, First Published Jun 14, 2021, 4:45 PM IST

మంగళగిరి: కరోనా మృతులకు ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేయాలి, అలాగే వృత్తులు కోల్పోయి ఆదాయం లేని వారికి రూ.10 వేలు ఇవ్వాలి, పంటలు కొనుగోలు చేసి ఎఎస్‌పి రేటు ఇవ్వాలి... ఇలాంటి 10 డిమాండ్ల సాధన కోసం ఈ నెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలను చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ డిమాండ్లు, నిరసన కార్యాక్రమాలపై చర్చించేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు సోమవారం టిడిపి పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. 

ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివే...


1. డిమాండ్ల సాధనకు చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలు: 

16.06.2021న తహసీల్దార్‌ కార్యాలయాలల్లో విజ్ఞాపన పత్రాలు సమర్పించుట
18.06.2021న రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల్లో విజ్ఞాపనలు
20.06.2021న కలెక్టర్‌ కార్యాలయాల్లో విజ్ఞాపన కార్యక్రమాలు
22.06.2021న 175 నియోజకవర్గాల్లో నిరసన దీక్షలు  

2. వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎంయస్‌పి రేట్లకు వెంటనే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారనే విషయాన్ని నారా లోకేష్‌ సభ దృష్టికి తెచ్చారు. వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి, బకాయిలు వెంటనే చెల్లించాలని పార్టీ డిమాండ్‌ చేసింది.

3. ఆస్తి పన్ను, యూజర్‌ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా ఈ నెల 15, 16 తేదీలలో అఖిలపక్ష పార్టీల నిరసన కార్యక్రమాలకు సంఫీుభావం ప్రకటించింది.

4. పల్లా శ్రీనివాస్‌ విశాఖ ఉక్కు ఉద్యమానికి అండగా వున్నందున అతని ఆస్తులపై ప్రభుత్వ దుష్ప్రచారాన్ని అచ్చెన్నాయుడు సమావేశం దృష్టికి తెచ్చారు. విశాఖ ప్రభుత్వ ఆస్తులుతాకట్టు నుండి ప్రజల దృష్టి మరలించడానికి, ఉత్తరాంధ్రలో బీసీ నేతలపై దాడులు చేస్తున్నారని సమావేశం అభిప్రాయపడింది.

5. ఆనందయ్య మందు ప్రజలందరికీ కాకుండా వైసీపీ నేతలు హైజాక్‌ చేస్తున్న విషయాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వివరించారు. ఆనందయ్య మందు తయారీ ఖర్చులకు ప్రభుత్వం సహకరించకపోవడాన్ని పార్టీ ఖండించింది.

read more  చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించాలి: మాన్సాస్ ట్రస్ట్‌ వివాదంపై హైకోర్టు తీర్పుపై ఆశోక్‌గజపతిరాజు

6. కృష్ణాజిల్లా అడిషనల్‌ ఎస్‌పి సత్తిబాబు తన ప్రసంగంలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ కూల్చిన ఉగ్రవాదిని ఆదర్శంగా స్తుతించడం, అలాగే సీఐడి అడిషనల్‌ డీజీ బ్రిటిష్‌ వారిని గొప్ప చేసి స్వదేశాన్ని కించపరచిన విధానాన్ని వర్ల రామయ్య సమావేశం దృష్టికి తెచ్చారు. డీజీపీ వీరిపైన రాజద్రోహం కేసు ఎందుకు పెట్టలేదని సమావేశం అభిప్రాయపడింది.

8. మద్యంలో ఏడాదికి రూ.5 వేల కోట్ల కుంభకోణం జరుగుతున్నది. ఐదేళ్లలో రూ.25 వేల కోట్ల కుంభకోణం ద్వారా మద్యం సేవించే వారి కుటుంబాల ఆర్థిక స్థితి తలకిందులవుతున్నది. విపరీత పరిణామాలకు కారణమవుతున్నది. అలాగే ఇసుక, సిలికా మాఫియా ద్వారా రూ.10 వేల కోట్ల కుంభకోణం జరుగుతున్నది. వీటిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ కమిటీ వేయాలని సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది.

9. కేరళ రాష్ట్ర ప్రభుత్వం డీజిల్‌, పెట్రోల్‌పై రూ.16 తగ్గించింది. అదేవిధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.10 డీజిల్‌, పెట్రోల్‌పై ధరలు తగ్గించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా మరో రూ.10 తగ్గించాలని సమావేశం కోరింది.

10. మాన్సాస్‌ ట్రస్టు, సింహాచలం దేవస్థానంకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవో 72ను హైకోర్టు కొట్టివేయడం ద్వారా చట్టం, ధర్మానిదే తుది విజయమని మరోసారి రుజువైందని సమావేశం అభిప్రాయపడింది.  
    
ఈ సమావేశంలో పయ్యావుల కేశవ్‌, కాలవ శ్రీనివాసులు, దేవినేని ఉమామహేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, బొండా ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, టీడీ జనార్థన్‌ తదితర నేతలు పాల్గొన్నారు.
 


 

Follow Us:
Download App:
  • android
  • ios