బ్రేకింగ్ న్యూస్... ఎమ్మెల్యే అనితపై వివాదం.. ఇరకాటంలో చంద్రబాబు

chandrababu is in dilemma on continuing christian mla inTTD Board
Highlights

పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలిలో సభ్యురాలైన అనిత వ్యవహారంలో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారా? ఆమె క్రస్టియన్ అని తెలియక ఆమెను ధర్మకర్తల మండిలో సభ్యురాలిగా చేశారా? ఇప్పుడు ఆమె నియామకంపై బాబు వెనకడుగు వేయబోతున్నారా? అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వస్తోంది.

పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలిలో సభ్యురాలైన అనిత వ్యవహారంలో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారా? ఆమె క్రస్టియన్ అని తెలియక ఆమెను ధర్మకర్తల మండిలో సభ్యురాలిగా చేశారా? ఇప్పుడు ఆమె నియామకంపై బాబు వెనకడుగు వేయబోతున్నారా? అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వస్తోంది. వివరాలు చదవండి.

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులను అధికారికంగా ప్రకటించింది ఎపి సర్కారు. అయితే ఈ బోర్డు సభ్యుల జబితాలో పక్కా క్రిస్టియన్ గా ఉన్న అనితను నియమించారని విమర్శలు గుప్పమంటున్నాయి. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అనిత తాను గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను పక్కా క్రిస్టియన్ అని అనిత ఆ వీడియోలో వెల్లడించారు. తన బ్యాగులో బైబిల్ ఉంటుందన్నారు. తన గదిలోనూ బైబిల్ ఉంటుందని వెల్లడించారు. అనిత ఇంటర్వ్యూ వనిత టివిలో వచ్చిన బైట్ కింద ఉంది చూడండి.

దీంతో ఆమె క్రిస్టియన్ కాబట్టి ఆమెను తక్షణమే బోర్డు సభ్యురాలిగా తొలగించాలని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాదు తెలుగుదేశం పార్టీలోనూ ఆ వీడియో తెగ సర్యూలేట్ అవుతోంది. దీంతో ఈ ముచ్చట కాస్తా.. టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబు నోటీసుకు వెళ్లింది. అంతేకాదు అనిత గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ సైతం బాబు పరిశీలనకు వెళ్లింది. దీంతో ఆమె క్రిస్టియన్ అనే విషయం తెలియక పోస్టు ఇచ్చామన్న భావనలో టిడిపి నేతలు సైతం ఆలోచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బాబు ఆమె మతం విషయంలో విచారణ జరుపుతున్నారు.

అనిత విషయంలో చంద్రబాబు విచారణ అనంతరం టిటిడి బోర్డు సభ్యత్వం రద్దు చేసే అవకాశాలున్నట్లు టిడిపి వర్గాలు చెబుతున్నయి. తానే స్వయంగా క్రస్టియన్ అని చెప్పిన తర్వాత ఆమె పోస్టు కంటిన్యూ చేస్తే వివాదం పెద్దగా మారే ప్రమాదముందని టిడిపి నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఛైర్మన్ గా నియమితులైన పుట్టా సుధాకర్ క్రిస్టియన్ అని కొన్ని వర్గాలు అలజడి రేపాయి. అయితే సుధాకర్ పక్కా యాదవ్ అని చెబుతున్నారు. అంతేకాదు సుధాకర్ కు మద్దతుగా యాదవులు ఆందోళనకు దిగారు. దీంతో సర్కారు ఆయన నియామకాన్ని చేసేసింది.

కానీ ఇప్పుడు అనిత విషయంలో ఆధారాలతో సహా వ్యవహారం బయటకు రావడంతో సిఎం చంద్రబాబు తన నిర్ణయం మార్చుకునే అవకాశాలున్నట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి. అతి కొద్ది సేపట్లోనే అనిత నియామకం రద్దయ్యే అవకాశముందని టిడిపి వర్గాల్లో టాక్ నడుస్తోంది.

loader