అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బతీశాయి. ఏపీ చరిత్రలో కనీవినీ ఎరుగని రితిలో ఘోరంగా ఓటమిపాలయ్యింది టీడీపీ. అయితే తాజాగా మరో పరాభవం తప్పలేదు తెలుగుదేశం పార్టీకి. 

తెలుగేశం పార్టీకేవలం 23 మంది ఎమ్మెల్యేలతోనే సరిపెట్టుకోవడంతో రాబోయే ఐదేళ్లలో రాజ్యసభ పదవి కోల్పోనుంది. ఒక్కసీటును కూడా టీడీపీ దక్కించుకునే అవకాశం లేదు.  44 మంది సభ్యులు ఉంటే ఒక రాజ్యసభ పదవి దక్కుతుంది. 

అయితే కేవలం 23 మంది మాత్రమే గెలవడంతో ఆఛాన్స్ కూడా మిస్ చేసుకోనుంది తెలుగుదేశం పార్టీ. ప్రస్తుతం రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వారిలో తోట సీతారామలక్ష్మీ తన పదవీకాలాన్ని వచ్చే ఏడాది పూర్తి చేసుకోబోతున్నారు. 

ఏప్రిల్ 9 2020నన ఆమె తమ పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఆమెతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సుబ్బిరామిరెడ్డి, ఎంఏ ఖాన్, కేకేలు రిటైర్మెంట్ కానున్నారు. సీతారామలక్ష్మితోపాటు ఏపీలో మరో మూడు స్థానాలు కలుపుకుని మెుత్తం నాలుగు రాజ్యసభ స్థానాలు వైసీపీ ఖాతాలో చేరనున్నాయి. 

ఇకపోతే 2022లో మరో ఇద్దరు ఎంపీల పదవీకాలం ముగియనుంది. 2022 జూన్ 21న సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్ లు తమ పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఇకపోతే 2024 ఏప్రిల్ 2న కనకమేడల రవీంద్రకుమార్, సీఎం రమేష్ ల పదవీకాలం పూర్తి కానుంది. 

దీంతో వచ్చే రాజ్యసభ ఎన్నికల నాటికి రాజ్యసభలో టీడీపీ ప్రాతినిథ్యం సున్నాకు చేరుతోంది. ఐదేళ్లలో టీడీపీకి ప్రాతినిధ్యమనేది రాజ్యసభలో ఉండదు. ఈ విషయం అర్థంకావడంతో  తెలుగుదేశం పార్టీ నేతలు  తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.