జేడీఎస్ తో కలిసి పనిచేస్తాం.. చంద్రబాబు

chandrababu intresting comments on JDS in bengaluru
Highlights

బెంగళూరులో మీడియాతో చంద్రబాబు

భవిష్యత్తులో జేడీఎస్ తో కలిసి పనిచేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ
ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు నేడు చంద్రబాబు బెంగళూరు వెళ్లారు.


ఈ సందర్భంగా అక్కడి మీడియాతో  చంద్రబాబు మాట్లాడారు..కుమారస్వామికి శుభాకాంక్షలు తెలిపి.. తమ సంఘీభావం తెలిపేందుకు వచ్చినట్లు ఆయన చెప్పారు. జాతి ప్రయోజనాల
 దృష్ట్యా భవిష్యత్‌లో జేడీఎస్‌తో కలిసి పనిచేసే అవకాశం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అక్కడే ఉండటం విశేషం. అంతేకాదు, అంతకుముందు మమతా బెనర్జీతో చంద్రబాబు భేటీ అయినట్లు కూడా తెలిసింది. దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులు చర్చకొచ్చినట్లు సమాచారం. ఏపీకి జరిగిన అన్యాయాన్ని మమతకు చంద్రబాబు వివరించారు. బీఎస్పీ నేత మాయావతితో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు.

loader