Asianet News TeluguAsianet News Telugu

2020నాటికి మూడు అత్యుత్తమ రాష్ట్రాల్లో ఏపీ ఒకటి ... చంద్రబాబు

2020 నాటికి దేశంలో మూడు అత్యుత్తమ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటిగా ఉండటమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 

CHANDRABABU INDEPENDENCE DAY SPEECH
Author
Srikakulam, First Published Aug 15, 2018, 11:51 AM IST

శ్రీకాకుళం జిల్లా:2020 నాటికి దేశంలో మూడు అత్యుత్తమ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటిగా ఉండటమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడిందన్న చంద్రబాబు రాష్ట్ర విభజనతో మరింత వెనుకబడిపోయింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించి నాలుగేళ్లలో రెండంకెల వృద్ధి రేటు సాధించామన్నారు. ఆదరణ పథకం ద్వారా కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నాం. 750కోట్ల రూపాయలతో 5లక్షల మందికి  పనిముట్లు అందజేశాం.

 కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. వంశధార నాగావళి నదుల అనుసంధానంతో సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టాం. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. కాపు కార్పొరేషన్ కింద వెయ్యి కోట్ల నిధులు కేటాయించాం. 26 కోట్ల రూపాయలతో జిల్లాకో కాపు భవనాన్ని నిర్మిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 

రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అన్నిచర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇకపోతే 2015-16 సంవత్సరంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన రాష్ట్రం రెండో స్థానంలో ఉంటే 2016- 2017లో మెదటి స్థానంలోనూ 2017- 18లో మళ్లీ మెుదటి స్థానంలో వచ్చిందని భవిష్యత్ లో కూడా మెుదటి స్థానంలోనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. 

అటు పెట్టుబడుల సదస్సుల ద్వారా  రాష్ట్రంలో 16 లక్షల12వేల 316కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ముందుకు వచ్చారని అవి పూర్తైతే 36లక్షల 40వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.  అటు విద్యారంగానికి కూడా తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. బడిపిలుస్తోంది వంటి కార్యక్రమాలతోపాటు డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. 

అలాగేట్రైబల్ యూనిర్శిటీ వచ్చినా నిధులు కేటాయింపు లేవని....ఇక వచ్చిన యూనివర్శిటీలకు అరకొర నిధులు ఇచ్చారని వాటిపై పోరాడుతున్నట్లు ప్రకటించారు. మెుదటి డీఎస్సీ ద్వారా 8,926 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తే రెండో డీఎస్సీ ద్వారా 10వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

ఇక గృహ నిర్మాణంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. గత ప్రభుత్వం రాజీవ్ గృహ కల్ప కింద ఇళ్లు నిర్మిస్తే  అవినివాసానికి యోగ్యంగా లేవన్నారు. కానీ తమ ప్రభుత్వం పేదోవాడి ఇళ్లు నివాస యోగ్యంగా ఒక హక్కుగా ఉండాలన్న లక్ష్యంతో  లేటెస్ట్ టెక్నాలజీతో పెద్ద ఎత్తున ఇళ్లు నిర్మిస్తున్నాం. చేనేత కార్మికులకు వర్క్ షెడ్ కం హౌస్ కింద మరో 75 వేలు అదనంగా ఇస్తున్నాం. అన్ని మౌళిక వసతులు కల్పిస్తున్నాం. ఎకనమిక్ సిటీని కూడా రూపొందిస్తున్నాం. ప్రతీ పేదవాడి  సొంతింటి కల నిజం కావాడమే ధ్యేయంగా ఐదు సంవత్సరాలలో 60వేల కోట్ల రూపాయలతో 25లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 

 ప్రతీ ఒక్కరికి ఇళ్ల స్థలం ఉండాలనే ఉద్దేశ్యంతో 4లక్షల మందికి 16వేల కోట్లు విలువ చేసే భూమిని అందించినట్లు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో డ్వాక్రా మెప్మా సంఘాలను ప్రవేశపెట్టాం. పసుపు కుంకమ కింద 10వేల కోట్ల రుణాలు, డ్వాక్రా రుణాలు అందజేసినట్లు తెలిపారు. 

గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. బాల సంజీవని, గిరి గోరు ముద్రలు, న్యూట్రీషన్ గార్డెన్స్ అమలు చేశాం. మాతాశిశు మరణాలను తగ్గించిన ఘనత తమ ప్రభుత్వానికే చెల్లుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పేదవాడి ఆరోగ్యం లక్ష్యంగా నాలుగేళ్లలో ఎన్నో పథకాలు తీసుకు వచ్చామన్నారు.

జననీ సురక్షసురక్ష యోజన, తల్లీ బిడ్డ ఎక్సెప్రెస్,నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు, ఎన్టీఆర్ బేబీ కిట్, మహిళా మాస్టర్ హెల్త్ చెకప్ సీఎం ఈ కంటి ఆస్పత్రి, చంద్రన్న సంచార చికిత్స కేంద్రాలు, ఉద్దానంలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఉద్దానంలో కిడ్నీ బాధితులకు రూ.2,500 రూపాయలు పింఛన్ అందిస్తున్నాం. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 2,50000 అందిస్తున్నాం. యూనివర్శల్ హెల్త్ కవర్ కింద ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా ప్రణాళిక చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios