చంద్రబాబే అనుమతులిచ్చారు: ఎల్జీ పాలీమర్స్ బాధితులతో వైఎస్ జగన్

ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీకి తమ ప్రభుత్వం  అనుమతులు ఇవ్వలేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. 1996లో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోనూ, 2015లోనూ మళ్లీ ఆయన అధికారంలో ఉన్న సమయంలో అనుమతులు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రమాదానికి కారణమైన వారెవరో తేలితే బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

Chandrababu government issued permissions to LG polymers says Ys jagan


అమరావతి: ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీకి తమ ప్రభుత్వం  అనుమతులు ఇవ్వలేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. 1996లో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోనూ, 2015లోనూ మళ్లీ ఆయన అధికారంలో ఉన్న సమయంలో అనుమతులు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రమాదానికి కారణమైన వారెవరో తేలితే బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

విశాఖపట్టణంలోని ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీ నుండి స్టైరిన్ గ్యాస్ లీక్ కావడంతో 12 మంది మృతి చెందారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయమై బాదితులకు పరిహారం చెల్లింపు విషయమై అధికారులతో సీఎం జగన్ సోమవారం నాడు వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు.

ఈ ఘటనపై చంద్రబాబునాయుడు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని విమర్శలు చేయడానికి పూనుకోకుండా బాధితులకు పరిహారం చెల్లించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసినట్టుగా ఆయన చెప్పారు. 

ఎల్జీ పాలీమర్స్ ఘటనపై వాస్తవాలను తెలుసుకొనేందుకు రాష్ట్ర స్థాయిలో కమిటి ఏర్పాటు చేసినట్టుగా ఆయన చెప్పారు. భవిష్యత్తులో  ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు

also read:ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీకి అనుమతులు: వైసీపీ ఆరోపణలపై బాబు సవాల్ ఇదీ...

విశాఖ గ్యాస్ లీకేజీ బాధితుల కోసం మొత్తం రూ. 37 కోట్ల 17 లక్షల 80 వేల రూపాయాలను విడుదల చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆసుపత్రుల్లో మూడు రోజుల పాటు చికిత్స పొందిన 485 మందికి లక్ష రూపాయాల చొప్పున రూ. 4.85 కోట్ల పరిహారం అందించినట్టుగా సీఎం జగన్ తెలిపారు.

ప్రాథమిక చికిత్స పొంది వెంటనే డిశ్చార్జ్ అయిన 99 మందికి రూ. 25 వేలచొప్పున రూ. 24.75 లక్షల పరిహారం చెల్లించినట్టుగా ప్రభుత్వం తెలిపింది. ఈ ప్యాక్టరీ నుండి వెలువడిన గ్యాస్ తో నష్టపోయిన ఆరు గ్రామాల్లోని 19,893 మందికి రూ. 10 వేల చొప్పున 19 కోట్ల 89 లక్షల 30 వేల పరిహారాన్ని చెల్లించినట్టుగా సీఎం తెలిపారు.

ఈ సంఘటనలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించిందని సీఎం జగన్ గుర్తు చేశారు. ఎక్కడా కూడ ఈ తరహాలో ప్రభుత్వం స్పందించిన ఘటన లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మరో వైపు అధికారులు కూడ వేగంగా స్పందించారని ఆయన వారిని అభినందించారు.

ఈ ఘటన జరిగిన సమయంలో రాజకీయాలు చేయకుండా మానవత్వంతో వ్యవహరించినట్టుగా ఆయన గుర్తు చేశారు. బాధితులను అన్ని రకాలుగా ఆదుకొంటామని ఆయన వారికి హామీ ఇచ్చారు. బాధిత గ్రామాల ప్రజలకు హెల్త్ కార్డులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన సమయంలో హామీ ఇచ్చారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios