Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ మహా పాదయాత్ర : నాయకుల గృహ నిర్భంధాలు అప్రజాస్వామికం.. చంద్రబాబు

చిత్తూరు టీడీపీ నాయకుల అక్రమ అరెస్టులను, గృహ నిర్భంధాలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. హంద్రీ-నీవా పనులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రామకుప్పం నుంచి టీడీపీ మహాపాదయాత్ర అడ్డుకోవడం అప్రజాస్వామికం అని మండిపడ్డారు. 

Chandrababu fires on tdp leaders house arrest due to TDP Maha Padayatra - bsb
Author
Hyderabad, First Published Oct 26, 2020, 1:12 PM IST

చిత్తూరు టీడీపీ నాయకుల అక్రమ అరెస్టులను, గృహ నిర్భంధాలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. హంద్రీ-నీవా పనులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రామకుప్పం నుంచి టీడీపీ మహాపాదయాత్ర అడ్డుకోవడం అప్రజాస్వామికం అని మండిపడ్డారు. 

రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్న టీడీపీపై అణచివేత చర్యలను ఖండిస్తున్నామన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పులివెందులకు నీళ్లిచ్చి చీనీ చెట్లు ఎండిపోకుండా కాపాడామని, అలాంటిది ఇప్పుడు కుప్పం నియోజకవర్గంపై ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను గర్హిస్తున్నామన్నారు.

తక్షణమే టీడీపీ నాయకులపై గృహనిర్బంధం ఎత్తివేయాలి. అక్రమ కేసులను తొలిగించాలని. రైతాంగ వ్యతిరేక చర్యలకు వైసీపీ స్వస్తి చెప్పాలన్నారు. కుప్పం రైతుల సాగునీటి సమస్యలు, తాగునీటి ఎద్దడి తక్షణమే పరిష్కరించాలని, హంద్రీ-నీవా ఎత్తిపోతల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios