రాజశేఖర్ రెడ్డి వల్లే కియా మోటార్స్ వచ్చిందన్న ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రతిపక్షనేత చంద్రబాబు మండిపడ్డారు.  2009లో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే.. ఆయన ఆత్మ కియా మోటార్స్ సీఈవో వద్దకు వెళ్లి చెప్పిందా అంటూ బాబు సెటైర్లు వేశారు.

దీనిపై మంత్రి బుగ్గన స్పందిస్తూ చంద్రబాబు మాటలను తాను దీవెనగానే భావిస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే సదావర్తి భూముల అంశం చర్చకు వచ్చింది. మరోసారి ఆర్కే మాట్లాడుతూ.. సదావర్తి భూములు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానివేనని.... 2011లో నాటి ముఖ్యమంత్రి రోశయ్య చెంగల్పట్టు ఆర్డీవోకు లేఖ రాసిన సంగతిని ప్రస్తావించారు. ఎ

ఎన్నోసార్లు చెన్నై వెళ్లిన చంద్రబాబు ఒక్కసారి కూడా అక్కడి ముఖ్యమంత్రితో ఈ విషయంపై చర్చించలేదని ఆర్కే దుయ్యబట్టారు.