వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను రాజకీయం చేస్తున్నారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వైఎస్ వివేకా హత్య లో చంద్రబాబు కుట్ర ఉంది అంటూ.. శుక్రవారం వైసీపీ అధినేత జగన్  ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై చంద్రబాబు స్పందించారు.

శనివారం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. జగన్ పై తవ్ర స్థాయిలో మండిపడ్డారు. వివేకా హత్య వాళ్ల ఊళ్లో.. వాళ్ల ఇంట్లో జరిగిందని.. దీనికి టీడీపీని నిందించడం అమానుషమన్నారు. తప్పులు చేసి తప్పించుకోవడం జగన్ దురలవాటని దుయ్యబట్టారు.

వ్యాపారంలో, రాజకీయంలో జగన్ అడ్డదారి, చెడ్డదారి చూసుకుంటారని ఆరోపించారు. జగన్ ఏరంగంలోకి అడుగుపెడితే.. ఆ రంగంలో అప్రదిష్ట అని అననారు. రాజకీయ లాభం కోసమే కోడికత్తి డ్రామా ఆడారని.. కావాలనే తనపై దాడి చేయించుకున్నారని ఆరోపించారు. ఎన్నికల కోసమే షర్మిలతో పాత కేసులు మళ్లీ పెట్టించారని మండిపడ్డారు.