టిడిపి తరపున రాజ్యసభ సభ్యులను చంద్రబాబునాయుడు ఫైనల్ చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న సిఎం రమేష్ నే మళ్ళీ కొనసాగించాలని నిర్ణయించారు. మరో స్ధానానికి టిడిపి లీగల్ అడ్వయిజర్ గా ఉన్న కనకమేడల రవీంద్ర కుమార్ పేరును ఖరారు చేశారు. వీరిద్దరూ సోమవారం నామినేషన్ వేయనున్నారు. మొత్తానికి మూడు రోజుల కసరత్తు తర్వాత చంద్రబాబు పై పేర్లను ఖరారు చేయటం గమనార్హం. వైసిపి తరపున వేమిరెడ్డి ప్రభాకర్ ఇప్పటికే నామినేషన్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే. భర్తీ చేయాల్సిన మూడు స్ధాలనాకు రెండు పార్టీల తరపున ముగ్గురు ఎంపికవ్వటంతో వీరి ఎన్నిక ఏకగీవ్రమైనట్లే.