ఏపీ  సీఎం జగన్‌రెడ్డి ఒక ఫేక్ ముఖ్యమంత్రి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అమరావతి రైతుల ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా అమరావతి జేఏసీ  ‘జనరణభేరి’ పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్ ను దుయ్యబట్టారు.

అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని, ఇప్పటికైనా జగన్ చేసిన తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు, మహిళలను రియల్ ఎస్టేట్ వ్యాపారులని సాక్షాత్ ముఖ్యమంత్రి అన్నారని, ప్రజల రక్తాన్ని తాగే వ్యాపారస్తుడు జగన్ అని మండిపడ్డారు. త్యాగం చేసిన రైతులపై ఇష్టానుసారం మాట్లాడుతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. 

‘‘జగన్ ఇష్టమొచ్చినప్పుడు ముద్దులు.. ఇప్పుడు పిడిగుద్దులా. పవిత్ర పుణ్యక్షేత్రాల నుంచి నీరు, మట్టి తీసుకొచ్చాం. ప్రధాని పార్లమెంట్ నుంచి మట్టి తీసుకొచ్చారు. సాక్షాత్తు పార్లమెంట్ మీకు అండగా ఉంటుందని ప్రధాని చెప్పారు. జగన్ గాలి కబుర్లు చెప్పడం ఇప్పటికైనా మానుకోవాలి. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిదంటున్నారు.. 

19 నెలల్లో ఏం పీకారు. అమరావతిలో నాకు ఇల్లు లేదంటున్నారు.. మీరు కట్టి ఏం పీకారు. ఒక కులంలో పుట్టడం నా తప్పా?. కులం చూసి హైదరాబాద్‌, విశాఖను అభివృద్ధి చేయలేదు. నా దగ్గర జగన్ తెలివి తేటలు పనిచేయవు. ద్రౌపది వస్త్రాపహరణం చేసినందుకు సామ్రాజ్యం కూలిపోయింది. మహిళల శాపంతో వైసీపీ నామరూపాలు లేకుండా పోతుంది’’ అని చంద్రబాబు హెచ్చరించారు.