చిరంజీవి ఏ పార్టీలో ఉన్నారో తెలియదు: చంద్రబాబు వ్యంగ్యం

Chandrababu comments on Chiranjeevi
Highlights

మాజీ రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యంగ్యాస్త్రం సంధించారు. 

అమరావతి: మాజీ రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యంగ్యాస్త్రం సంధించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ పెట్టారని, ప్రజలు ఆదరించలేదని, మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారని ఆయన అన్నారు. కానీ చిరంజీవి కాంగ్రెస్‌లో ఉన్నారో లేదో స్పష్టత లేదని చంద్రబాబు శనివారం మీడియా సమావేశంలో అన్నారు.

తనపై బీజేపీ, వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాళ్లతో పవన్‌కల్యాణ్ కూడా కలిశారని ఆయన అన్నారు. రాష్ట్రంలో పుట్టినవారు కూడా పోలవరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంలో చేరడానికి వైసీపీ ఆశ పడుతోందని తెలిపారు. 

పార్లమెంట్‌లో పోరాటం నుంచి తప్పించుకునేందుకే వైసీపీ డ్రామాలాడుతోందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. పోరాడే సమయంలో వైసీపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేశారని అడిగారు. ఎన్నికలు రాని రాజీనామాలు ఎందుకని అన్నారు. 
అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు ఎందుకని అడిగారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరం అని చెప్పారు. భావితరాల భవిష్యత్‌ కోసం టీడీపీ మళ్లీ రావాలని ఆయన అన్నారు.

loader