అమరావతి: భారత ప్రధాని నరేంద్రమోదీ ఏపీలో పర్యటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ పర్యటనపై సహాయ నిరాకరణకు పిలుపునిచ్చారు. మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసనలకు పిలుపునిచ్చారు. 

తెలుగుదేశం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పరంగా మోదీ పర్యటనను బాయ్ కాట్ చెయ్యాలని పిలుపునిచ్చారు. విభజన గాయంపై కారం పూసేందుకే మోదీ వస్తున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

మోదీ సభలకు హాజరుకాకుండా గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జనవరి 1న బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొనాలని, శాంతియుతంగా నిరసనలు తెలపాలని సీఎం ఆదేశించారు. 

మోదీ ఏపీలో పర్యటించి ఏం చెప్తారాని ప్రశ్నించారు. ఏపీకి చేసిందేమీ లేదని అలాంటిది ఏం చెప్తారంటూ మండిపడ్డారు. మోదీ పర్యటనకు సహాయ నిరాకరణ చెయ్యాల్సిందేనని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.