అవసరమైనపుడు బిజెపిని దగ్గరకు తీసుకోవటం, అవసరం తీరిపోంగానే వదిలేయటం చంద్రబాబుకు మామూలే.
రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబునాయుడు విచిత్రమైన పరిస్దితిని ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్న టిడిపి ఏకాకైపోయింది. గతంలో ఎప్పుడూ ఈ పరిస్దితి చంద్రబాబుకు ఎదురుకాలేదు. కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీలతో చంద్రబాబు గట్టి సంబంధాలనే పెట్టుకునే వారు. అవసరమైనపుడు బిజెపిని దగ్గరకు తీసుకోవటం, అవసరం తీరిపోంగానే వదిలేయటం చంద్రబాబుకు మామూలే. బిజెపితో ఒకసారి, వామపక్షాలతో అనేకసార్లు చంద్రబాబు ఇదే గేమ్ ఆడారు. ఏదేమైనా, ఏదో ఓ పార్టీ చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తుండేది.
కానీ ప్రస్తుత పరిస్దితి మాత్రం గతంకు భిన్నంగా ఉంది. మిత్రపక్షంగా ఉన్న బిజెపి ప్రతిపక్షమైపోయింది. సరే, వైసిపి అంటే మొదటి నుండి ప్రతిపక్షమే అనుకోండి. మొన్నటి వరకూ మిత్రపక్షంగా ఉన్న జనసేన కూడా దూరమైపోయింది.
.
వామపక్షాలు ఒకసారి జనసేనతోను మరోసారి జగన్ తోనూ టచ్ లో ఉన్నారే కానీ టిడిపివైపు మాత్రం చూడటం లేదు. ఇక, కాంగ్రెస్ గురించి అనుకోవాల్సిన అవసరమే లేదు. సో ఏ విధంగా చూసినా ప్రతిపక్షాల్లో దేనితోనూ చంద్రబాబుకు ఇప్పటికైతే కామన్ శతృవైపోయారు. ప్రస్తుత పరిస్ధితుల్లో టిడిపికి మద్దతుగా నిలబడే పార్టీ ఒక్కటి కూడా కనబడటం లేదు.
ఒకవైపు ఎన్నికలు తరుముకొచ్చేస్తున్నాయ్. ఇంకోవైపు సమస్యలు పెరిగిపోతున్నాయ్. రాజకీయంగా శతృపక్షాలు ఒక్కొకటిగా పెరిగిపోతున్నారు. పార్టీ పరిస్దితి కూడా జనాల్లో ఏమంతా బావోలేదు. ఇటువంటి పరిస్దితుల్లో ఏమి చేయాలో దిక్కుతోచక చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది
Last Updated 27, Mar 2018, 5:14 PM IST