Asianet News TeluguAsianet News Telugu

17 కార్పొరేషన్లకు ఛైర్మన్లు: టిటిడి ఛైర్మన్ గా పుట్టా

టిటిడి ఛైర్మన్ గా పుట్టా నియామకం చాలా కాలంగా వివాదాస్పదంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.
chandrababu appointed putta as TTD Chairman

మొత్తానికి పుట్టా సుధాకర్ యాదవ్ టిటిడి ట్రస్ట్  బోర్డు ఛైర్మన్ గా నియమితులయ్యారు. టిటిడి ఛైర్మన్ గా పుట్టా నియామకం చాలా కాలంగా వివాదాస్పదంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

వివాదాలన్నింటినీ కాదని, యనమల రామృష్ణుడు ఒత్తిడికి లొంగిన చంద్రబాబు చివరకు ఆయన్నే చైర్మన్ గా మంగళవారం రాత్రి నియమించారు. బోర్డు ఛైర్మన్ తో పాటు మరో 16 కార్పొరేషన్లకు కూడా ఛైర్మన్లను నయిమిమించారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీఅయ్యాయి.

ఎన్నికలు తరముకొస్తున్న నేపధ్యంలో చంద్రబాబు చేసిన నియామకాలపై పార్టీలోనే విస్మయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే, ఇన్ని కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా చంద్రబాబు ఒక్కసారిగా ఎప్పుడూ నియమించలేదు.

విచిత్రమేమిటంటే ఇప్పటి నియామకంలో ఇటీవలే టిడిపిలో చేరిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కూడా ఉండటం. సాగునీటి అభివృద్ధిశాఖకు ఛైర్మన్ గా నల్లారిని నియమించారు.

ఆర్టీసీ ఛైర్మన్ గా వర్ల రామయ్య, గ్రంధాలయ పరిషత్ ఛైర్మన్ గా దాసరి రాజా మాస్టర్, శాప్ ఛైర్మన్ గా పి. అంకమ్మ చౌదరి, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ గా దివి శివరాం, మైనారిటీ కార్పొరేషన్ ఛైర్మన్ గా జియాఉద్దీన్, మైనారిటీ ఆర్ధిక సంస్ధ ఛైర్మన్ గా హిదాయత్ ను నియమించారు.

గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్ధ చైర్మన్ గా నాగేశ్వర్రావు యాదవ్, కనీస వేతనాల మండలి ఛైర్మన్ గా రఘుపతుల రామ్మోహన్ రావు, గృహ నిర్మాణ సంస్ధ ఛైర్మన్ గా నామన రాంబాబు, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గా జూపూడి ప్రభాకర్ నియమితులయ్యారు.

కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా కొత్తపల్లి సుబ్బరాయుడు, ఆర్టీసీ విజయనగరం రీజియన్ ఛైర్మన్ గా తెంటు లక్ష్మీనాయుడు, విజయవాడ రీజియన్ ఛైర్మన్ గా మెంటే పార్ధసారధి, నెల్లూరు రీజియన్ ఛైర్మన్ గా ఆవి సుభాష్ చంద్రబోస్, కడప రీజియన్ ఛైర్మన్ గా చల్లా రామకృష్ణారెడ్డిని నియమించారు.  

కాపులకు, ఎస్సీలో మాదిగ, మాలకు చెరొకటి, కమ్మలకు రెండు, రెడ్లకు రెండు, ఇద్దరు ముస్లింలకు, రెండు యాదవులకు, ఒక కొప్పుల వెలమ నేతకు ఛైర్మన్ పోస్టులు కట్టబెట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios