Asianet News TeluguAsianet News Telugu

ఏపీ రాజకీయ బాధిత రాష్ట్రం:కేంద్రంపై చంద్రబాబు ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాజకీయ బాధిత రాష్ట్రం అని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘం ప్రతినిధులతో అమరావతిలో సమావేశమైన చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, నాలుగేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతి, వృద్ధి గణాంకాలపై చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీకి జరిగిన అన్యాయంపై గళమెత్తారు సీఎం చంద్రబాబు. 
 

chandrababau naidu comments on 15 finance commission meeting
Author
Amaravathi, First Published Oct 11, 2018, 3:27 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయ బాధిత రాష్ట్రం అని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘం ప్రతినిధులతో అమరావతిలో సమావేశమైన చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, నాలుగేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతి, వృద్ధి గణాంకాలపై చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీకి జరిగిన అన్యాయంపై గళమెత్తారు సీఎం చంద్రబాబు. 

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్రం ఆ హామీని నిలబెట్టుకోలేదని అలాగే పునర్విభజన చట్టంలో పొందుపరచిన ఏ అంశాన్నీ అమలు చేయలేదని విమర్శించారు. కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధి, సంక్షేమ పథకాలు విస్తృతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. 

దేశ సంపద వృద్ధికి దోహదపడేలా తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. పురోగామి రాష్ట్రాలను దెబ్బతీయడం మంచిది కాదని చంద్రబాబు హితవు పలికారు. అభివృద్ధి చెందే రాష్ట్రాలకు చేయూత అందించాలని కోరారు.
 
ఆర్థిక సంఘాల నివేదికలకు 1971 జనాభా లెక్కలే ప్రాతిపదిక కావాలని చంద్రబాబు అన్నారు. మధ్యప్రదేశ్‌లో మెట్రోలకు భారీగా నిధులు కేటాయించారు కానీ విశాఖ, విజయవాడ మెట్రోలకు మాత్రం మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. గతంలో నయా రాయపూర్‌కు రూ.4500 కోట్ల సాయం అందించారని గుర్తుచేశారు. అమరావతికి కనీసం రూ.9,000 కోట్లు కేంద్రం గ్రాంటుగా ఇచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. 

వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.22,250 కోట్లు సిఫార్సు చేయాలని ఆర్థిక సంఘానికి సూచించారు. కేంద్రం ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకుందని విమర్శించారు. 14వ ఆర్థిక సంఘంపై నెపాన్ని నెట్టి హోదాపై కేంద్రం మాటమార్చిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ప్రత్యేక హోదా: మా పరిధిలోకి రాదన్న 15వ ఆర్థిక సంఘం

Follow Us:
Download App:
  • android
  • ios