ప్రత్యేక హోదా: మా పరిధిలోకి రాదన్న 15వ ఆర్థిక సంఘం

First Published 11, Oct 2018, 5:36 PM IST
15th finance commission chairman meets cm  chandrababu
Highlights

ప్రత్యేక హోదా అంశం 15వ ఆర్థిక సంఘం పరిధిలోకి రాదని ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్ కే సింగ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో 15వ ఆర్థిక సంఘం ప్రతినిధులు రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్ కే సింగ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా అయినా ప్రత్యేక హోదా సాధించుకుందామని ఎన్నో ఆశలపై ఆర్థిక సంఘం నీళ్లు చల్లింది. 

అమరావతి: ప్రత్యేక హోదా అంశం 15వ ఆర్థిక సంఘం పరిధిలోకి రాదని ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్ కే సింగ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో 15వ ఆర్థిక సంఘం ప్రతినిధులు రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్ కే సింగ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా అయినా ప్రత్యేక హోదా సాధించుకుందామని ఎన్నో ఆశలపై ఆర్థిక సంఘం నీళ్లు చల్లింది. 

హోదా తమ పరిధిలోకి రాదంటూ తేల్చిచెప్పేశారు. ప్రత్యేక హోదా సమ్మతగ్గ అంశమని ఇప్పటికే అమలు చేసి ఉంటారని తాను భావించినట్లు తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టం రాజ్యసభకు వచ్చినప్పుడు తాను రాజ్యసభలో ఉన్నానని స్పష్టం చేశారు. 

గతంలో విభజన చట్టాల అమలుకు ప్రత్యేక వ్యవస్థ ఉండేదని ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ వాటికి బాధ్యులుగా ఉండేవారని తెలిపారు. అయితే ఏపీ పునర్విభజన చట్టం అమలు పర్యవేక్షణకు ఎలాంటి వ్యవస్థ లేదని తెలిపారు. అయితే రెవెన్యూ లోటు భర్తీపై ఏపీ ప్రతిపాదనలను పరిశీలిస్తావమని తెలిపారు. ప్రత్యేక హోదా అంశాన్ని తప్పించుకునేందుకే 14వ ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపించారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీ రాజకీయ బాధిత రాష్ట్రం:కేంద్రంపై చంద్రబాబు ఫైర్

 

loader