ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని ఆ పార్టీ శ్రేణులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎవ్వరూ అధైర్యపడొద్దని అండగా ఉంటానని అధినేత చెబుతున్నప్పటికీ కొందరు నేతలు అవమాన భారంతో ఇళ్ళలోంచి బయటకు రావడం లేదు.

ఈ క్రమంలో ఏపీ మాంసపు ఉత్పత్తుల అభివృద్ధి కార్పోరేషన్ ఛైర్మన్‌ చంద్రదండు ప్రకాశ్ నాయుడు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సంబంధిత శాఖ కమీషనర్‌కు పంపినట్లు ఆయన తెలిపారు.