చమన్ కారు డ్రైవర్ అనుమానాస్పద మృతి: అసలేం జరిగింది?

చమన్ కారు డ్రైవర్ అనుమానాస్పద మృతి: అసలేం జరిగింది?

అనంతపురం: పరిటాల రవీంద్ర అనుచరుడు, అనంతపురం జిల్లా మాజీ చైర్మన్ చమన్ మరణించిన నాలుగు రోజుల్లోనే ఆయన కారు డ్రైవర్ నూర్ మహమ్మద్ (27) గురువారం రాత్రి మరణించారు. చమన్ మృతికి దీనికి ఏమైనా లింక్ ఉందా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

అనంతపురంలోని బోయవీధికి చెందిన నూర్ మహ్మద్ కొంత కాలంగో చామన్ కారు డ్రైవర్ పనిచేస్తున్నాడు. ఆయన హఠాన్మరణం చెందిన రోజు కూడా కారు డ్రైవర్ గా అతనే ఉన్నాడని సమాచారం. బుధవారంనాడు పనిలోకి రావద్దని అతనికి చెప్పిన సమాచారం. ఆ క్రమంలోనే అనతు గురువారం రాత్రి అతను బత్తలపల్లి వైపు టూవీలర్ మీద బయలుదేరాడు. 

మన్నీల దగ్గరకు రాగానే మహబూబ్ బాషా (45) అనే వ్క్తి ఐచర్ వాహనం పంక్చర్ కావడాన్ని నూర్ మహమ్మద్ గమనించాడు. అతన్ని పలకరించేందుకు వెళ్తుండగా ఇన్నోవా వాహనం అతన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం గుత్తి ఆర్ఎస్ ప్రాంతానకి చెందిన ఐచర్ వాహనం డ్రైవర్ మహబూబ్ బాషాతో పాటు నూర్ మహ్మద్ కూడా అక్కడికక్కడే మరణించారు. ఐచర్ వాహనం క్లీనర్ మహేష్ నాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

ఇదిలావుంటే, చమన్ ఈ నెల 7వ తేదీన అకస్మిక మరణం పాలైన విషయం తెలిసిందే. అంతకు ముందు రోజు మంత్రి పరిటాల సునీత కూతురు స్నేహలత వివాహం జరిగింది. మర్నాడే చమన్ మరణించారు. దీంతో పరిటాల సునీత తీవ్ర మనస్తాపానికి గురై స్పృహ కూడా కోల్పోయారు. 

ముందుగా తీసుకున్న నిర్ణయం మేరకు రెండున్నరేళ్ల పదవీ కాలం ముగిసిన తర్వాత జెడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడానికి చమన్ నిరాకరించారు. అయితే, సెప్టెంబర్ 8వ తేదీన ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించారు. ఆ తర్వాత ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తారని ఆశించిన చమన్ కు నిరాశే ఎదురైంది. 

పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న చమన్ పార్టీ మారే యోచన చేసినట్లు చెబుతున్నారు. ఓ ప్రముఖమైన పార్టీ నుంచి హిందూపురం పార్లమెంటు సీటును ఆయన ఆశించినట్లు చెబుతున్నారు. అయితే, ఆయన అకస్మాత్తుగా మృతి చెందారు.

ఈ స్థితిలో నూర్ మహమ్మద్ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడం వల్ల మరణించాడని చెబుతున్నారు. అయితే, కావాలనే అతన్ని వాహనంతో ఢీకొట్టి హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page