Asianet News TeluguAsianet News Telugu

TDP Manifesto: " భవిష్యత్తుకు గ్యారంటీ" టీడీపీ మేనిఫెస్టో .. చంద్రబాబు ప్రకటించిన వరాలివే.. 

TDP Manifesto: తెలుగు దేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడులో ఎవరూ ఊహించని విధంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మొదటి విడత మేనిఫేస్టోను ప్రకటించారు. భవిష్యత్తుకు గ్యారెంటీ అనే పేరుతో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. అవి ఏంటో తెలుసుకుందాం.

Chadrababu Naidu Announces TDP Manifesto For 2024 Elections KRJ
Author
First Published May 29, 2023, 3:58 AM IST

TDP Manifesto: తెలుగు దేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడులో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సంచలన ప్రకటనలు చేశారు. 2024లో రానున్న ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకుని కీలక హామీలు ఇచ్చారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేక్కించుకోవాలని "భవిష్యత్ కు గ్యారంటీ" పేరుతో మినీ మేనిఫెస్టోని చంద్రబాబు ప్రకటించారు. వైఎస్ జగన్ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ.. తాము అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతామో ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు టీడీపీ పెద్దపీట వేస్తూ ఆరు కీలక పథకాలను వెల్లడించారు. అలాగే.. టీడీపీకి ఆది నుంచి అండగా ఉంటున్న బీసీలకు కూడా ఈ మ్యానిఫెస్టోలో స్థానం కల్పించారు. ఏటా మూడు సిలిండర్లు ఫ్రీ, మహిళలకు  ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని ప్రకటించారు. అలాగే.. నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగభృతి అందిస్తామని చంద్రబాబు సంచలన హామీలిచ్చారు.
 .

1) పూర్ టూ రిచ్ (పేదలను ధనవంతులు చేయడం)

పేదల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడు పూర్ టూ రిచ్ అనే పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకంతో ఐదేళ్ళలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని టీడీపీ  ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. 


2) బీసీలకు రక్షణ చట్టం 

బీసీలకు అన్ని విధాల అండగా ఉండాలనే ఉద్దేశ్యంలో బీసీలకు రక్షణ చట్టం తీసుకరానున్నది టీడీపీ. వైఎస్సార్సీపీ హయాంలో 26 మందికి పైగా బీసీలు హత్యకు గురైయ్యారు. 650 మంది నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు. అలాగే.. 40 మందికి పైగా ముస్లిం మైనార్టీలపై దాడులు. వీటిని దృష్టిలో పెట్టుకుని టీడీపీ బీసీలకు రక్షణ చట్టాన్ని కల్పిస్తోంది. వారికి 

3) ఇంటింటికీ నీరు 

టీడీపీ అధికారంలోకి వస్తే.. "ఇంటింటికీ మంచి నీరు" పథకం ద్వారా ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగు నీరు అందించనున్నారు.     

4) అన్నదాత 

అలాగే.. చంద్రబాబు రైతులకు కూడా పెద్ద పీఠ వేశారు. అన్నదాత పథకం పేరుతో ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని హామి ఇచ్చారు.  

5) మహిళ ‘మహా’ శక్తి

మహిళా ఓటర్లను ఆకర్షించే విధంగా మహాశక్తి  అనే పేరుతో ఓ పథకాన్ని తీసుకుని వస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా  ప్రతి కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన మహిళలకు "స్త్రీనిధి" కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. అలాగే.. 'తల్లికి వందనం' పథకం కింద  చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15,000లు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాగే.. "దీపం" అనే పేరుతో పథకాన్ని ప్రారంభనున్నారు. ఈ పథకం పేరుతో రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు. "ఉచిత బస్సు ప్రయాణం" పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు చంద్రబాబు.

6) యువగళం

నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశ్యంలో  20 లక్షల మంది ఉపాధి కల్పించనున్నారు.  అలాగే.. ప్రతి నిరుద్యోగికి 'యువగళం నిధి' కింద నెలకు 3000 రూపాయలను అందిస్తామని  తెలుగుదేశం హామీ ఇచ్చింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios