చంద్రబాబునాయుడుకు కేంద్రప్రభుత్వం రెండు విధాలుగా షాక్ ఇచ్చింది.
చంద్రబాబునాయుడుకు కేంద్రప్రభుత్వం రెండు విధాలుగా షాక్ ఇచ్చింది. మొదటిదేమో బడ్జెట్ విషయంలో కాగా రెండో షాకేమో రాజకీయపరమైనది. మొదటి షాక్ లో ఏమో రాష్ట్రప్రభుత్వం ఆశించిన మేరకు బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు లేవన్న విషయం తెలిసిందే, పోలవరం, రాజధాని, మెట్రో రైలు, రెవిన్యూలోటు భర్తీ ఇలా..ఏది తీసుకున్న గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రం రాష్ట్రానికి మొండి చెయ్యే చూపించింది. దాంతో చంద్రబాబుకు షాక్ తగిలినట్లైంది.
ఇక రెండో విషయం రాజకీయపరమైనది. ఏపిలో అసెంబ్లీ సీట్లను పెంచాలంటూ చంద్రబాబు ఎప్పటి నుండో కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ సీట్లు పెంచటమన్నది పూర్తిగా రాజకీయపరమైనది. అసెంబ్లీ సీట్లు పెరుగుతాయన్న నమ్మకంతోనే చంద్రబాబు యధేచ్చగా ఫిరాయింపులను ప్రోత్సహించారు. అయితే, సీట్ల పెంపు సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ, ఎన్నికల కమీషన్ కూడా చాలాసార్లు చెప్పాయి.
కేంద్రం ఏ విధంగా చెప్పినా చంద్రబాబు మాత్రం ఒత్తిడి పెడుతూనే ఉన్నారు. చివరకు ఈమధ్య ప్రధానమంత్రిని కలిసిన సందర్భంలో కూడా సీట్ల పెంపు అంశాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు ప్రచారం జరిగింది.
ఈ నేపధ్యంలో ఒకవైపు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన ఏపి, తెలంగాణాలోని భాజపా కోర్ కమిటీ నేతలు సమావేశమయ్యారు. సరే, అనేక అంశాలపై చర్చ జరిగింది. అదే సందర్భంగా సీట్ల పెంపు విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. అసెంబ్లీ సీట్లు పెంచటం వల్ల భాజపాకు వచ్చే ఉపయోగం ఏదీ లేదని భాజపా నేతలు తెగేసి చెప్పినట్లు సమాచారం.
అయితే, సీట్లు పెంచే విషయంలో అంతిమ నిర్ణయం మాత్రం జాతీయ నాయకత్వానికే వదిలేసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. భాజపా నేతల తాజా సమావేశంతో సీట్ల పెంపు జరగదన్న విషయం దాదాపు ఖాయమైపోయింది. సీట్ల పెంపు జరగకపోతే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పరిస్దితి.....
