ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం అనేక మలుపులు తిరుగుతుంది. గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో ఇక ఏర్పాటు లాంఛనమే అనుకుంటున్నా తరుణంలో... అమరావతి పరిరక్షణ సమితి కోర్టుకెక్కడంతో కొద్దీ రోజులపాటు స్తబ్దుగా ఉంది. 

ఇంతలోనే కేంద్రం హైకోర్టులో జగన్ సర్కార్ కి అనుకూలంగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని తుది నిర్ణయం రాష్ట్ర పరిధిలోకే వస్తుందని కేంద్ర హోంశాఖ హైకోర్టులో గురువారం నాడు దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. 

రాజధాని నిర్ణయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని కోర్టుకి తెలిపింది. చట్టసభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చ.. కోర్టుల్లో న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని కేంద్ర హోంశాఖ ఈ సందర్భంగా తేల్చిచెప్పింది.

హైకోర్టులోని రిట్‌ పిటిషన్‌ కు కౌంటర్ గా కేంద్ర హోంశాఖ ఈ అఫిడవిట్‌ ను దాఖలు చేసింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 6 ప్రకారమే 2014లో శివరామకృష్ణన్‌ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. 

రాజధాని ఎక్కడ పెట్టాలన్న దానిపై శివరామకృష్ణన్‌ కమిటీ పరిశీలన జరిపిందని, ఆగస్టు 30, 2014న ఈ కమిటీ రాజధాని విషయమై నివేదిక సమర్పించిందని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. 

2015లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయాలనీ నిర్ణయించిందని వారు కోర్టుకు తెలిపారు. రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని, ఉండబోదని కోర్టుకి  

 జులై 31, 2020న ఏపీ ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణ కు సంబంధించి గెజిట్‌ను విడుదల చేసిందని, గెజిట్‌ ప్రకారంగా ఏపీలో మూడు పరిపాలనా కేంద్రాలుంటాయని పేర్కొన్నారు. 

గెజిట్‌ ప్రకారంగా శాసన రాజధానిగా అమరావతి, పరిపాలనా/కార్యనిర్వాహక  రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును పేర్కొన్నారని కేంద్రం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపింది.