Asianet News TeluguAsianet News Telugu

ఏపీ సీఎం జగన్ ను ప్రశంసించిన కేంద్రమంత్రి

కరోనా వైరస్ పుణ్యమాని విధించిన లాక్ డౌన్ వల్ల చాలామంది వలసకూలీలు ఇతర రాష్ట్రాల్లో చిక్కుబడిపోయిన విషయం తెలిసిందే! కేంద్రం తాజాగా ఇలా చిక్కుబడ్డ వలస కూలీలను వెనక్కి తీసుకువచ్చెనందుకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు ఆ పనుల్లో నిమగ్నమయ్యాయి. 

Central Minister Dharmendra Pradhan Praises YS jagan on tackling the corona virus
Author
Amaravathi, First Published May 2, 2020, 3:38 PM IST

కరోనా వైరస్ పుణ్యమాని విధించిన లాక్ డౌన్ వల్ల చాలామంది వలసకూలీలు ఇతర రాష్ట్రాల్లో చిక్కుబడిపోయిన విషయం తెలిసిందే! కేంద్రం తాజాగా ఇలా చిక్కుబడ్డ వలస కూలీలను వెనక్కి తీసుకువచ్చెనందుకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు ఆ పనుల్లో నిమగ్నమయ్యాయి. 

ఈ క్రమంలో భాగంగా నేడు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు. 

ఏపీలో చిక్కుకున్న ఒడిశా వలస కూలీలు, కార్మికులు, చిక్కుకుపోయిన వారి తరలింపుపై వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. దానితోపాటుగా ఒడిశాలో ఉన్న ఏపీ వాళ్లనికూడా తరలించే విషయమై చర్చలు జరిగాయి. 

ఏపీలో చిక్కుకుపోయిన వలసకూలీలు, కార్మికులకు మంచి వసతి, భోజన సదుపాయాలు అందించి ఆదుకున్నందుకు జగన్ కి థాంక్స్ చెప్పారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. ఆయన మాట్లాడుతూ... "ఆంధ్రప్రదేశ్‌లో ఉండాలనుకుంటున్న ఒడిశా వారికి మంచి వసతి, భోజన సదుపాయాలు అందించారు. అంతేకాక మా రాష్ట్రానికి వస్తున్న వారికి అవసరమైన రవాణా సౌకర్యాలు ఏర్పాటుచేయడానికి మీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమన్వయం చేస్తున్నాం. కోవిడ్‌ వల్ల ఎదురవుతున్న క్లిష్ట పరిస్ధితిని ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేస్తోంది" అని కితాబిచ్చారు. 

ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ... "‘మీ అభ్యర్ధనను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం నవీన్‌ జీ. దాదాపు 20 వేల మంది ఒడిశా ప్రజలు మా రాష్ట్రంలో ఉన్నారు. వీరిలో రిలీఫ్‌క్యాంప్‌లలో ఉన్నవారిలో దాదాపు 1900 మందికిపైగా ఒడిశా వెళ్ళడానికి సిద్దంగా ఉన్నారు. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మిగిలిన వారిని కూడా వారు పనిచేస్తున్న చోటే ఉండేందుకు ఏర్పాట్లుచేస్తున్నాం. ఒకవేళ వారిలో ఎవరైనా తిరిగి ఒడిశా వెళ్ళేందుకు సిద్దమైతే వారిని కూడా పంపేందుకు ఏర్పాట్లు చేస్తాం నవీన్‌ జీ. మీలాంటి నాయకులు చాలా స్ఫూర్తిదాయకులు" అని నవీన్ పట్నాయక్ ను కొనియాడారు. 
 
ఇక ఆ తరువాత ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి దర్మేంద్ర ప్రధాన్, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. విపత్తు సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఒడిశా కూలీలు, కార్మికులు, చిక్కుకుపోయిన ప్రజలను బాగా చూసుకుంటున్నారంటూ ధన్యవాదాలు తెలిపారు.కోవిడ్‌–19 నివారణలో బాగా పనిచేస్తున్నారంటూ సీఎంను ప్రశంసించారు.

Follow Us:
Download App:
  • android
  • ios