Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగులేం పాపం చేసారు ?

నవంబర్ జీతంలో కొంత మొత్తాన్ని అంటే రూ. 10 వేలు ఈనెల 23వ తేదీన చెల్లించేందుకు ఏర్పాట్లు కూడా చేసింది.  

Central Govt employees to receive Rs 10000 by Nov 23

తన ఉద్యోగులకు రూ. 10 వేలు నగదు రూపంలో ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. పెద్ద నోట్ల రద్దుతో యావత్ దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో కేవలం తన ఉద్యోగుల విషయంలో మాత్రం కేంద్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం గమనార్హం. ఇందులో భాగంగానే నవంబర్ జీతంలో కొంత మొత్తాన్ని అంటే రూ. 10 వేలు ఈనెల 23వ తేదీన చెల్లించేందుకు ఏర్పాట్లు కూడా చేసింది.  

 

నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు మాత్రం ఈ సౌకర్యం కల్పిస్తూ గురువారం కేంద్రం ఓ ఉత్తర్వును విడుదల చేసింది. రూ. 10 వేలు తీసుకో దలచిన ఉద్యోగులు శుక్రవారంలోగా తమ అంగీకారాన్ని తెలపాలి. రూ. 10 వేలు పోను మిగిలిన మొత్తాన్ని ఈ నెలాఖరులో వారి ఖాతాలో జమచేస్తుంది. ఈ ఉత్తర్వు కేంద్ర ఉద్యోగులతో పాటు కేంద్రప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న వారికి, ప్రభుత్వ రంగ సంస్ధల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా వర్తింపచేసింది.Central Govt employees to receive Rs 10000 by Nov 23

అంత వరకూ బాగానే ఉన్నా మరి లక్షల సంఖ్యలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాటేమిటి? రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఏమి పాపం చేసారు. ప్రస్తుతం ఇదే విషయంపై రాష్ట్రప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతల మధ్య చర్చలు జరుగుతోంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విధంగా ఆలోచించినా ఉద్యోగులకు ఇవ్వటానికి ఖజానాలో అసలు డబ్బుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఉద్యోగులు సరే, మరి మిగిలిన ప్రజానీకం మాటేమిటి? అంటే కేంద్రం జారీ చేసిన ఉత్తర్వును చూస్తే ఎవరి చావు వారు చావండన్నట్లుగా ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios