కేంద్ర ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్‌కు షాక్ ఇచ్చింది. 14వ ఆర్థిక సంఘం ఆంద్రప్రదేశ్‌లోని గ్రామీణ సంస్థలకు సిఫారసు చేసిన నిధులను ఇప్పుడు విడుదల చేయడం కుదరదని కేంద్రం పార్లమెంటులో స్పష్టం చేసింది. 14వ ఆర్థిక సంఘం కాలవ్యవధి ముగిసిన కారణంగా ఇది సాధ్యం కాదని వివరించింది. 

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆంద్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థలకు కేంద్రం బకాయిపడ్డ రూ. 529.96 కోట్ల నిధులను విడుదల చేయలేమని పార్లమెంటులో వెల్లడించింది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ సూటిగా సమాధానం చెప్పారు. ఆ మొత్తం నిధులను విడుదల చేయలేమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసిందని పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పార్లమెంటులో వెల్లడించారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ సంస్థలకు 14వ ఆర్థిక సంఘం (2015-2020) సిఫార్సు చేసిన నిధుల్లో సుమారు రూ. 529 కోట్లు విడుదల కాకుండానే అటకాయించింది. ఈ నిధులు విడుదల కావడంలోగానే 14వ ఆర్థిక సంఘం కాలవ్యవధి ముగిసిపోయింది. ఈ మిగిలిపోయిన నిధుల గురించి రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపి ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

14వ ఆర్థిక సంఘం కాలవ్యవధి ముగిసిపోయిందని, కాబట్టి, ఆ సంఘం సిఫారసు చేసిన నిధులను ఇప్పుడు విడుదల చేయలేమని ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం తమకు తెలిపిందని పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ తెలిపారు. అయితే, 2020-2026 కాలానికి 15వ ఆర్థిక్ సంఘం స్థానిక సంస్థలకు సిఫారసు చేసిన నిధులను యథావిధిగా విడుదల చేస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఆర్థిక శాఖ రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఆర్థిక సంఘం సిఫారసు చేసిన నిధులను విడుదల చేస్తామని వివరించారు.

పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కొనసాగుతున్న ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి (vijayasai reddy)కి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరిన్ని బాధ్యతలు అప్పగించారు. పార్టీ అన్ని అనుబంధ విభాగాల ఇంఛార్జ్ గా విజయసాయిని నియమించారు. ఇందుకు సంబంధించి వైఎస్సార్ సిపి జాతీయ అధ్యక్షులు వైఎస్ జ‌గ‌న్ పేరిట ఓ ప్రకటన వెలువడింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీఎం జగన్ తర్వాత రెండోస్థానం ఎవరిదంటూ టక్కున వినిపించే పేరు విజయసాయి రెడ్డి. మంత్రులకు, ఎమ్మెల్యేలు ఎవ్వరికీ ఇయ్యని ప్రాధాన్యత సీఎం జగన్ విజయసాయికి ఇచ్చేవారు. అయితే ఇటీవల పార్టీలో ఆయన ప్రాధాన్యత తగ్గినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీలో, ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు ఆ అనుమానాలను మరింత పెంచాయి. 

ఈ మధ్య ప్రభుత్వ వ్యవహారాలే కాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి (sajjala ramakrishna reddy) చూసుకుంటున్నారు. పీఆర్సీ వివాదంలో ఉద్యోగులతో ప్రభుత్వ ప్రతినిధిగా సజ్జల చర్చలు జరపుతూ కీలకంగా వ్యవహరించారు. సీఎం జగన్ కూడా ఈ సమయంలో సజ్జలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కొన్ని కీలక ప్రకటనలు కూడా ఆయననుండే వెలువడ్డాయి. దీంతో సీఎం జగన్ సజ్జలకు అధిక ప్రాదాన్యత ఇస్తున్న విషయం ఉద్యోగులకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమయ్యింది. 

ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డిని దూరంపెట్టిన సీఎం సజ్జలను దగ్గరయినట్లు రాజకీయ వర్గాల్లోనే కాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ ప్రచారం జరిగింది. ఉద్యోగుల ఆందోళనల సమయంలో అసలు విజయసాయి ఎక్కడా కనిపించలేదు. అంతకుముందు పార్టీ వ్యవహారాలతో ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే విజయసాయి ఒక్కసారిగా సైలెన్స్ కావడంతో ఆయన ప్రాధాన్యత తగ్గిందంటూ ప్రచారం మరింత జోరందుకుంది.