Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ జగన్‌కు షాక్.. ప్రత్యేక హోదా ముగిసిన విషయం, మరోమారు కుండబద్థలు కొట్టిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌కు (andhra pradesh) ప్రత్యేక హోదా (special status) అనేది ముగిసిపోయిన అంశమని కేంద్ర ప్రభుత్వం (govt of india) మరోసారి తేల్చిచెప్పింది.  ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై టీడీపీ (tdp) ఎంపీ రామ్మోహన్ నాయుడు (ram mohan naidu) మంగళవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ (nityanand rai) లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

center clarity on ap special status
Author
Amaravati, First Published Nov 30, 2021, 6:17 PM IST

ఆంధ్రప్రదేశ్‌కు (andhra pradesh) ప్రత్యేక హోదా (special status) అనేది ముగిసిపోయిన అంశమని కేంద్ర ప్రభుత్వం (govt of india) మరోసారి తేల్చిచెప్పింది.  ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై టీడీపీ (tdp) ఎంపీ రామ్మోహన్ నాయుడు (ram mohan naidu) మంగళవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ (nityanand rai) లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్నింటినీ పూర్తి చేసేందుకు ఎప్పటికప్పుడు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతోపాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో ఇప్పటి వరకు 25 సమీక్షా సమావేశాలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. 

రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నామని... 14వ ఆర్థిక సంఘం సిఫారసులతో ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయిందని కేంద్రం స్పష్టం చేసింది. అందువల్ల 2015-16 నుంచి 2019-20 మధ్య కేంద్ర ప్రాయోజిత పథకాలను 90:10 నిష్పత్తి కింద వచ్చే మొత్తాన్ని ప్రత్యేక సాయంగా ఏపీకి ఇచ్చేందుకు అంగీకరించామని నిత్యానందరాయ్ వెల్లడించారు. 2015-16 నుంచి 2019-20 వరకు కుదుర్చుకున్న విదేశీ రుణాలకు సంబంధించిన అసలు, వడ్డీని కూడా కేంద్రమే చెల్లిస్తుంది.’’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం మరోసారి లోక్‌సభలో స్పష్టం చేసింది. ప్రత్యేక సాయం చేయడానికి కేంద్రం అంగీకారం తెలిపామని.. విభజన చట్టంలో చాలా అంశాలు అమలయ్యాయని, మిగిలిన వాటికి కొంత సమయం ఉందని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. 

Also Read:ప్రత్యేక హోదా విస్మరించారు, విభజన హమీలు అమలు కాలేదు: సదరన్ జోనల్ కౌన్సిల్‌లో జగన్

మరోవైపు శీతాకాల పార్లమెంటు సమావేశాలలో (parliament winter session) ప్రత్యేక హోదా అంశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు వైసీపీ ఎంపీలు. ప్రత్యేక హోదా ఉంటేనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్న నేతలు... దీని కింద ఏయే ప్రయోజనాలు ఇస్తారో అవన్నీ ఏపీకి ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయాలని నిర్ణయించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios