గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా తెలంగాణ నుండి మద్యం అక్రమరవాణాకు అడ్డుకట్ట పడటంలేదు.   తెలంగాణ మద్యాన్ని బార్డర్ దాటించడానికి అక్రమార్కులు అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. ఇలా పోలీసులకు అనుమానం రాకుండా ఓ సిమెంట్ మిక్సింగ్ లారీలో అక్రమంగా తరలిస్తున్న 1140 తెలంగాణ మద్యం సీసాలను గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండ వద్ద ఎస్ఈబీ పోలీసులు పట్టుకున్నారు. మద్యాన్ని స్వాదీనం చేసుకుని లారీ సీజ్ చేసిన పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. 

వీడియో

"

మరోవైపు కృష్ణా జిల్లా కోరుకొల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన తాబేళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యానులో తరలించడానికి సిద్దంగా వున్న తాబేళ్లను   పోలీసులు స్వాధీనపరుచుకున్నారు.