వైఎస్ వివేకా హత్య కేసు: ఉస్మానియాలో వైఎస్ భాస్కర్ రెడ్డికి వైద్య పరీక్షలు
వైఎస్ భాస్కర్ రెడ్డిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు సీబీఐ అధికారులు. వైద్య పరీక్షలు నిర్శహించిన తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు.
హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఆదివారంనాడు మధ్యాహ్నం హైద్రాబాద్ కు తీసుకువచ్చారు సీబీఐ అధికారులు. హైద్రాబాద్ కు చేరిన వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి వైఎస్ భాస్కర్ రెడ్డిని తరలించారు సీబీఐ అధికారులు. ఉస్మానియా ఆసుపత్రిలో వైఎస్ భాస్కర్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తైన తర్వాత సీబీఐ మేజిస్టేట్ ఎదుట వైఎస్ భాస్కర్ రెడ్డిని హాజరుపర్చనున్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ ఉదయం పులివెందులలో వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ విషయాన్ని వైఎస్ భాస్కర్ రెడ్డ భార్య లక్ష్మికి సీబీఐ అధికారులు సమాచారం ఇచ్చారు. పులివెందుల నుండి హైద్రాబాద్ కు వైఎస్ భాస్కర్ రెడ్డిని తీసుకువచ్చారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత హైద్రాబాద్ కు వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు తరలించారు. హైద్రాబాద్ కు రాగానే నేరుగా ఉస్మానియా ఆసుపత్రికి వైఎస్ భాస్కర్ రెడ్డిని తీసుకు వచ్చారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన సీబీఐ మేజిస్ట్రేట్ ముందు వైఎస్ భాస్కర్ రెడ్డిని హజరుపర్చనున్నారు సీబీఐ అధికారులు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై గతంలో వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ విచారించింది. వైఎస్ భాస్కర్ రెడ్డి నివాసాన్ని కూడా సీబీఐ బృందం పరిశీలించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య చేసిన రోజున నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి నివాసంలో ఉన్నారని సీబీఐ ఆరోపిస్తుంది. గూగుల్ టేకవుట్ ద్వారా ఆధారాలున్నాయని చెబుతుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తరుణంలో విచారణను మరింత వేగవంతం చేసిండి సీబీఐ
also read:వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు: అరెస్టైంది వీరే, కేసు కొలిక్కి వచ్చేనా?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారించారు. ఉద్దేశ్యపూర్వకంగా ఈ కేసులో తమను ఇరికించే ప్రయత్నం చేస్తుందని వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. రెండు రోజుల క్రితం వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్ట్ జరిగిన రెండు రోజులకే వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది.