Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: రేపు విచారణకు రావాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి  సీబీఐ అధికారులు ఇవాళ నోటీసులు జారీ చేశారు. 
 

CBI Serves  Notice To  Kadapa MP  YS Avinash Reddy
Author
First Published Jan 23, 2023, 9:59 PM IST

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసులో  కడప ఎంపీ  వైఎస్ అవినాష్ రెడ్డికి  సీబీఐ అధికారులు  సోమవారం నాడు  నోటీసులు పంపారు. ఈ నెల  24న విచారణకు రావాలని  సీబీఐ అధికారులు  నోటీసులు జారీ చేశారు.  హైద్రాబాద్ లోని తమ కార్యాలయంలో   ఈ నెల  24న ఉదయం  11 గంటలకు విచారణకు హాజరు కావాలని  సీబీఐ అధికారులుఆ నోటీసులో పేర్కొన్నారు.

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో విచారణ కోసం సీబీఐ అధికారులు ఇవాళ కడపలో  విచారణ నిర్వహించారు. ఇవాళ కడప నుండి పులివెందులకు వెళ్లిన సీబీఐ అధికారులు  వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి గురించి ఆరా తీశారు.  వైఎస్ భాస్కర్ రెడ్డి  ఇంటి పరిసరాలను కూడా  సీబీఐ అధికారులు  పరిశీలించారు.  

2019 మార్చి  19వ తేదీన పులివెందులలో  వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు.ఈ కేసులో  దస్తగిరి సీబీఐకి అఫ్రూవర్  గా మారాడు.  దస్తగిరి  ఇచ్చిన వాంగ్మూలాన్ని  సీబీఐ అధికారులు  కోర్టులో  సమర్పించారు.  బెంగుళూరులోని  భూ సెటిల్ మెంట్  అంశానికి సంబంధించి   వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిందని  దస్తగిరి  సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో  పేర్కొన్నారని సమాచారం.  ఈ కేసు  విషయమై పలువురిని సీబీఐ అధికారులు అరెస్ట్  చేశారు.  

ఎర్రగంగిరెడ్డి , కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి   అనుచరుడిగా  ఉన్న దేవిరెడ్డి  శివశంకర్ రెడ్డి,ని కూడా సీబీఐ అధికారులు అరెస్ట్  చేశారు. మరో వైపు ఉమా శంకర్ రెడ్డి , సునీల్ యాదవ్   తదితరులను అరెస్ట్  చేశారు. ఈ కేసులో  కొందరికి  బెయిల్ మంజూరైంది.  

ఈ కేసులో  ప్రధాన నిందితుడిగా  ఎర్ర గంగిరెడ్డిని  సీబీఐ అనుమానిస్తుంది. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కూడా కోరుతూ సీబీఐ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ ను  తెలంగాణ హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. 

also read:వైఎస్ వివేకా హత్య కేసు.. పులివెందులలోని వైసీపీ కార్యాలయానికి సీబీఐ అధికారులు.. భాస్కర్ రెడ్డి గురించి ఆరా..

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఏపీలో కాకుండా ఇతర రాష్ట్రంలో విచారణ చేయాలని   వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ నిర్వహించిన  సుప్రీంకోర్టు  కేసు విచారణను  తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios