Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇంట్లో సీబీఐ సోదాలు

నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఇంట్లో సీబీఐ అధికారుల దాడులు జరిగినట్లుగా వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. బెంగళూరు నుంచి వచ్చిన సీబీఐ అధికారుల బృందం.. బుధవారం అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 

cbi raids on tdp mlc vakati narayana reddy house in nellore
Author
Nellore, First Published Aug 2, 2019, 8:09 AM IST

నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఇంట్లో సీబీఐ అధికారుల దాడులు జరిగినట్లుగా వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. బెంగళూరు నుంచి వచ్చిన సీబీఐ అధికారుల బృందం.. బుధవారం అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

2014-15 సంవత్సరంలో వీఎన్ఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ పేరుతో వాకాటి నారాయణరెడ్డి పలు బ్యాంకుల నుంచి దాదాపు రూ.257 కోట్ల రుణాలు తీసుకున్నారు. 2017 నాటికి అది వడ్డీతో కలిపి రూ.577 కోట్లకు చేరుకుంది.

అయితే బ్యాంకులకు రుణాలను సకాలంలో చెల్లింకపోవడంతో నిబంధనల ప్రకారం ఆయన ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. బ్యాంకులను మోసం చేసి ఎక్కువ రుణాలు పొందారంటూ నారాయణరెడ్డిపై సీబీఐకి ఫిర్యాదు చేశారు అధికారులు.

దీనిపై రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థ ఈ వ్యవహారంపై విచారణ జరిపి పలు ఆధారాలతో 2018 జనవరి 21వ తేదీన వాకాటిని అరెస్ట్ చేశారు.  నాటి నుంచి నారాయణరెడ్డి బెంగళూరులోని పరప్పన అగ్రహరం జైలులో ఖైదీగా ఉన్నారు.

ఈ క్రమంలో సీబీఐ పలు మార్లు ఆయన నివాసంలో దాడులు నిర్వహించింది.  తాజాగా నారాయణరెడ్డి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో సీబీఐ దాడులు సంచలనం సృష్టించాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios